STOCKS

News


లాభాల ప్రారంభం

Friday 10th May 2019
Markets_main1557459879.png-25644

అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల ఫలితంపై మార్కెట్లో డోలాయమాన స్థితి కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం భారత్‌ సూచీలు స్వల్పలాభంతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 73 పాయింట్ల లాభంతో 37632 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 11,314 పాయింట్ల వద్ద మొదలయ్యింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నుంచి ఒక మంచి లేఖ అందుకున్నానంటూ గురువారం అమెరికా అధ్యక్షుడు వెల్లడించడంతో శుక్రవారం ఉదయం షార్ట్‌ కవరింగ్‌ ఫలితంగా ఆసియా సూచీలు భారీగా పెరిగినప్పటికీ, తదుపరి సగం లాభాల్ని కోల్పోయాయి. ఈ కారణంగా భారత్‌ సూచీలు స్వల్పలాభాలతో మొదలయ్యాయి. ఈ రోజు నుంచే చైనాపై అమెరికా టారీఫ్‌ల పెంపు అమల్లోకి రానుండగా, మరోవైపు ఇరుదేశాల మధ్య గురువారం ముగియాల్సిన చర్చల్ని శుక్రవారానికి పొడిగించారు. ఈ అంశాల నేపథ్యంలో ట్రేడ్‌ డీల్‌ కుదరడానికి 50 శాతం అవకాశం వుందన్న అంచనాలు మార్కెట్లో కొనసాగుతున్నాయి. తాజాగా  హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ , చైనా షాంఘై, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ , తైవాన్‌ వెయిటెడ్‌, జపాన్‌ నికాయ్‌ సూచీలు ఒక శాతం వరకూ లాభాలతో ట్రేడవుతున్నాయి. . గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు ఒకదశలో 2 శాతం వరకూ పతనమైన అనంతరం ట్రేడింగ్‌ ముగింపులో నష్టాల్ని బాగా తగ్గించుకున్నాయి. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 10th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సుందరమ్ ఫాస్ట్నెర్స్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ప్రతి ఈక్విటీ షేరుపై రూ.3.10 రెండో మధ్యంతర డివిండెండ్‌ చెల్లింపునకు బోర్డు ఆమోదం తెలిపింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- తన అనుబంధ సం‍స్థ రిలయన్స్‌ బ్రాండ్స్‌ హాలేస్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌తో 100శాతం ఈక్విటీ వాటాను రూ.650 కోట్లకు కొనుగోలు చేసేందుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వెల్‌స్పాన్‌ కార్పో:- షేర్ల బై బ్యాక్‌ ఆఫర్‌ అంశంపై చర్చించేందుకు

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్‌

Friday 10th May 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిష్కారం డోలాయమానంలో వుండటంతో  చవిచూసిన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం సైతం గ్యాప్‌డౌన్‌తో  ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40  గంటలకు దాదాపు 40 పాయింట్ల తగ్గుదలతో 11,296 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,336 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నుంచి ఒక మంచి లేఖ అందుకున్నానంటూ గురువారం అమెరికా అధ్యక్షుడు వెల్లడించడంతో

Most from this category