STOCKS

News


నష్టాలతో ప్రారంభం

Tuesday 22nd January 2019
Markets_main1548129113.png-23713

సెన్సెక్స్‌ 80 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు డౌన్‌

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలత ఫలితంగా మంగళవారం స్టాక్‌ సూచీలు నష్టాలతో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌80  పాయింట్ల తగ్గుదలతో 36,500 పాయింట్ల సమీపంలో ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో10931 .పాయింట్ల వద్ద మొదలయ్యింది.  ట్రేడింగ్‌ ప్రారంభంలో సన్‌ఫార్మా 4 శాతం జంప్‌చేయగా, కొటక్‌ బ్యాంక్‌ 1.5 శాతం పెరిగింది. డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌, ఆసియా పెయింట్స్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీలు అరశాతం లాభంతో మొదలయ్యాయి. మరోవైపు యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హిందాల్కో, ఇన్ఫోసిస్‌లు 1 శాతం నష్టాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. 

ఆసియా మార్కెట్లు డౌన్‌

సోమవారం అమెరికా మార్కెట్లకు మార్టిన్‌లూథర్ కింగ్‌డే సందర్భంగా సెలవుకాగా, యూరప్‌ సూచీలు అరశాతం నష్టాలతో ముగిసాయి. ఇందుకు అనుగుణంగా తాజాగా ఆసియాలోని ప్రధాన సూచీలన్నీ క్షీణతతో ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, చైనా షాంఘై,  కొరియా కోస్పిలు 0.8శాతం వరకూ తగ్గగా, తైవాన్‌ వెయిటెడ్‌, 0.25 శాతం క్షీణించింది. సింగపూర్‌, జపాన్‌ సూచీలు స్వల్పనష్టాలతో కదులుతున్నాయి. అలాగే అమెరికా ఇండెక్స్‌ ఫ్యూచర్లు సైతం అరశాతంపైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

2019 కేంద్ర బడ్జెట్‌ ‘హల్వా’

Tuesday 22nd January 2019

 నోటి తీపితో... ముద్రణ ఘట్టం ప్రారంభం నార్త్‌బ్లాక్‌లో సాంప్రదాయక కార్యక్రమం ఆర్థికశాఖ సహాయమంత్రులు, సీనియర్‌ అధికారులు హాజరు హాజరుకాలేకపోయిన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాలో గడుపుతున్న నేపథ్యం ఫిబ్రవరి 1న పార్లమెంటులో తాత్కాలిక బడ్జెట్‌ న్యూఢిల్లీ: సాంప్రదాయకంగా వస్తున్న ‘హల్వా’ తీపి రుచులతో 2019 కేంద్ర బడ్జెట్‌ పత్రాల ముద్రణా కార్యక్రమం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో సోమవారంనాడు ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో ‘బడ్జెట్‌ హల్వా’ రుచి చూడడానికి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రులు శివ్‌ ప్రతాప్‌ శుక్లా, పొన్‌ రాథాకృష్ణన్‌,

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 22nd January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఎస్సార్‌ షిప్పింగ్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా సందీప్‌ అకోల్కర్‌ రాజీనామా చేశారు. ప్రభాత్‌ డైరీ:- పాల ప్రాసెసింగ్‌ వ్యాపారాన్ని అంతర్జాతీయ పాల వ్యాపార సంస్థ లాక్టాలిస్‌ కు రూ.1700 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. లార్సన్‌ అండ్‌ టర్బో:- నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ రూ.9000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను సెబీ రద్దు చేసిన నేపథ్యంలో కంపెనీ సెష్పల్‌ డివిడెండ్‌ జారీ అంశాన్ని పరిశీలిస్తుంది. శ్రేయీ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌:-

Most from this category