పాజిటివ్ ఓపెనింగ్
By Sakshi

సెన్సెక్స్ 74 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్లు అప్ ఆసియా సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో సోమవారం భారత్ సూచీలు స్వల్పలాభంతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 36,100 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 10,793 పాయింట్ల వద్ద మొదలయ్యింది. శుక్రవారం తీవ్ర పతనాన్ని చవిచూసిన జీ ఎంటర్ప్రైజెస్ 10 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 350 వద్ద ప్రారంభమయ్యింది. గత శుక్రవారం పటిష్టమైన ఆర్థిక ఫలితాలు వెల్లడించిన ఎల్ అండ్ టీ 2 శాతం లాభంతో రూ. 1,315 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. యస్‌బ్యాంక్, టాటా మోటార్స్, టీసీఎస్‌లు స్వల్పలాభాలతో ఆరంభమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, జెఎస్డబ్ల్యూ స్టీల్‌లు నష్టాలతో మొదలయ్యాయి. గత శుక్రవారం అమెరికా స్టాక్ సూచీలు లాభాలతో ముగియగా, తాజాగా ఆసియాలోని జపాన్ మినహా ప్రధాన దేశాల మార్కెట్లన్నీ స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి.
You may be interested
సెన్సెక్స్ మద్ధతు 38850
Monday 28th January 2019అమెరికా, యూరప్, కొన్ని ఆసియా సూచీలు బ్రేక్అవుట్ను సాధించి, ముందడుగు వేసినప్పటికీ, భారత్ సూచీలు కీలక స్థాయిల వద్ద నిరోధాన్ని చవిచూసి, వెనకడుగువేసాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చార్‌పై సిబీఐ..ఎఫ్ఐఆర్ నమోదుచేయడం, ఐటీసీ బలహీన ఆర్థిక ఫలితాలు, జీ గ్రూప్ సంక్షోభం వంటి ప్రతికూల వార్తలకు తోడు ఈ వారంలో వెల్లడికానున్న కేంద్ర బడ్జెట్లో ద్రవ్యలోటు పెరగవచ్చన్న అందోళనలు భారత్ మార్కెట్‌ను కిందకు లాగాయి. తాజాగా మరో పెద్ద
బడ్జెట్‌పై మార్కెట్ దృష్టి
Monday 28th January 2019- ఫిబ్రవరి 1న బడ్జెట్ - ఈనెల 29–30 తేదీల్లో ఫెడ్ సమావేశం - ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు ఈ వారంలోనే.. న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఈవారంలో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఫిబ్రవరి 1న (శుక్రవారం) లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అధికార ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా.. ఈ బడ్జెట్లో వెల్లడికానున్న పలు కీలక ప్రతిపాదనలు దేశీ స్టాక్ సూచీలకు దిశా నిర్దేశం