News


11050 దిగువన నిఫ్టీ ప్రారంభం

Friday 8th March 2019
Markets_main1552017751.png-24480

ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 40 పాయింట్ల నష్టంతో 36680 వద్ద, నిప్టీ 22 పాయింట్లను కోల్పోయి 11035 వద్ద ప్రారంభమైంది. ఆంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రపంచమార్కెట్లలో బలహీన సెంటిమెంట్‌ నెలకొంది. నెమ్మదించిన ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచే ప్రక్రియలో భాగంగా వడ్డీరేట్ల పెంపును వాయిదా వేయడంతో పాటు తక్కువ వడ్డీలకు రుణాలను మంజూరు చేస్తున్నట్లు గురువారం ఈసీబీ ప్రకటించింది. దీంతో ఆర్థిక వృద్ధిపై ఆందోళనతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేయడంతో ప్రపంచమార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ ప్రతికూల ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లపై పడింది. ఉదయం గం.9:20ని.కు సెన్సెక్స్‌ 64 పాయింట్ల నష్టంతో 36,662 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లను కోల్పోయి 11,034 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐటీ, మెటల్‌, అటో, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, ప్రభుత్వరంగబ్యాంక్‌, ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. 
ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌టెక్‌, హిందాల్కో, ఐఓసీ, విప్రో షేర్లు 1.50శాతం నుంచి 3శాతం నష్టపోగా, ఎంఅండ్‌ఎం, ఇన్ఫ్రాటెల్‌, భారతీఎయిర్‌టెల్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌లిమిటెడ్‌, ఎన్‌టీపీసీ షేర్లు 2.50శాతం లాభపడ్డాయి.
- ఆసియాలో  అన్ని మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా చైనా మార్కెట్‌ మార్కెట్‌ 3శాతం నష్టపోయింది. జపాన్‌ మార్కెట్‌ 2శాతం, హాంకాంగ్‌ మార్కెట్‌ 1.50శాతం, దక్షిణ కొరియా మార్కెట్‌ 1శాతం నష్టపోయాయి. అలాగే సింగపూర్‌ స్రైట్స్‌ టైమ్స్‌, తైవాన్‌ సూచీలు సైతం అరశాతం నష్టపోయాయి. 
- అమెరికా సూచీలు వరుసగా నాలుగోరోజూ నష్టాలతో ముగిశాయి. డోజోన్స్‌ 200 పాయింట్లు(0.8 శాతం) క్షీణించి 25,473 వద్ద ఎస్‌అండ్‌పీ 23 పాయింట్లు(0.8 శాతం) బలహీనపడి 2,749 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 84 పాయింట్లు(1.1 శాతం) వెనకడుగు వేసి 7,421 వద్ద స్థిరపడింది.You may be interested

శుక్రవారం వార్తల్లో షేర్లు

Friday 8th March 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- ఈఎస్‌పీఎస్‌ పథకంలో భాగంగా తన సొంత ఉద్యోగులకు ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.660.80 కోట్లను సమీకరించింది.  రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ విమానశ్రయ నిర్మాణానికి సంబంధించి ఎయిర్‌పోర్ట్‌ఆథారిటీఆప్‌ఇండియా నుంచి రూ.650 కోట్ల విలువైన ఆర్డరును దక్కించుకుంది.  జెట్‌ ఎయిర్‌వేస్:- నిధుల కొరత కారణంగా మరో మూడు విమానాలను రద్దు చేసినట్లు డీజీసీఎ అధికారి తెలిపారు.  కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌:- తమిళనాడులో రోడ్ల

ట్రంప్‌ హెచ్చరికలు... మార్కెట్‌కు ఆందోళన కలిగించేవేనా?

Thursday 7th March 2019

భారత్‌కు వాణిజ్య ప్రాధాన్యం హోదా (జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్‌పీ)ను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళవారం ఆరంభంలో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లినా ఆ తర్వాత లాభాల్లోనే ప్రయాణించాయి. జీఎస్‌పీ కార్యక్రమం 5.6 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఎగుమతులకు వర్తిస్తోంది. వీటిపై అమెరికాలో సుంకాలు ఉండవు. ఇప్పటికే ఎగుమతుల వృద్ధి నిదానంగా ఉన్న భారత్‌కు జీఎస్‌పీని రద్దు చేయడం రూపాయిపై

Most from this category