STOCKS

News


లాభాల ప్రారంభం..వెంటనే నష్టాల్లోకి

Tuesday 19th March 2019
Markets_main1552967006.png-24677

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం వెలువడనున్న నేపథ్యంలో భారత్‌ సూచీలు లాభాలతో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా మార్కెట్లు స్వల్పనష్టాలతో ట్రేడవుతున్న కారణంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల స్వీకరణ జరగడంతో హెవీవెయిట్‌ షేర్లు ప్రారంభగరిష్టస్థాయి నుంచి తగ్గాయి. 100 పాయింట్లకుపైగా లాభంతో 38,200 పాయింట్ల సమీపంలో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,243 పాయింట్ల వరకూ పెరిగిన తర్వాత ఐదు నిముషాల్లోనే 38,091 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. అలాగే 11,500 పాయింట్ల వద్ద పటిష్టంగా ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కొద్ది నిముషాల్లోనే 11,455 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది.సన్‌ఫార్మా, గ్రాసిమ్‌, భారతి ఎయిర్‌టెల్‌, గెయిల్‌ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలో 1-3 శాతం మధ్య జంప్‌చేసాయి. మరోవైపు హీరో మోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీలు 1-2 శాతం మధ్య నష్టాలతో మొదలయ్యాయి.  శుక్రవారం రాత్రి అమెరికా డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌,  నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఆసియా సూచీలన్నీ స్వల్పనష్టాలతో కదులుతున్నాయి.   



You may be interested

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 19th March 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్స్‌:- రూ.10 కోట్ల విలువైన బై బ్యాక్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా ప్రతి షేరు ధర రూ.130లుగా నిర్ణయించారు. వక్రంజీ:- వైట్‌ లేబుల్‌ ఏటీఎంల పునరుద్ధరణకు ఆర్‌బీఏ ఆమోదం తెలిపింది.  ఏజిస్ లాజిస్టిక్స్:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండో మధ్యంతర డివిడెండ్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.1ముఖవిలువ కలిగిన ప్రతిషేరుకు రూ.0.50ల డివిడెండ్‌ను చెల్లించనుంది.  హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- జిరాక్స్‌ కార్పోరేషన్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు అప్‌

Tuesday 19th March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్పనష్టాలతో ట్రేడవుతున్నప్పటికీ,  వరుసగా ఆరురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు మంగళవారం సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40 గంటలకు 11,524 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,494  పాయింట్ల వద్ద

Most from this category