STOCKS

News


ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Wednesday 30th January 2019
Markets_main1548842957.png-23903

జనవరి డెరివేటివ్స్‌ కాంట్రాక్టు రేపు(గురువారం) ముగియనుండటం, అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై నేడు నిర్ణయాన్ని ప్రకటించనుండటం, కేంద్రం ప్రభుత్వం ఎల్లుండి(శుక్రవారం) మధ్యంతర ఒడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న అంశాల నేపథ్యంలో బుధవారం ఆద్యంతం స్టాక్‌ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై, చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 1 పాయింటు కోల్పోయి 35,591 వద్ద, నిఫ్టీ అరపాయింట్ల నష్టపోయి 10,651.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 359 పాయిం‍ట్ల రేంజ్‌ 35,491 - 35,850 పాయింట్ల రేంజ్‌ కదలాడింది. నిఫ్టీ 100 పాయింట్ల శ్రేణిలో 10,613 - 10,710 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనయ్యింది. ఒకవైపు కార్పొరేట్‌ లెండింగ్‌ బ్యాంకులు సూచీలకు మద్దతునందించగా, మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, కొటక్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ వంటి హెవీవెయిట్లు సూచీల లాభాల్ని హరించివేసాయి.  యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్ల పెరుగుదలతో ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌  1శాతం(252 పాయింట్లు) ర్యాలీ చేసి 26,825.50 వద్ద ముగిసింది. ఇదే ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా, రియల్టీ ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఫైనాన్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌లు అత్యధికంగా 1శాతం లాభపడ్డాయి. అటో, ఐటీ ఇండెక్స్‌లు స్వల్పంగా లాభపడ్డాయి.

ఇన్ఫ్రాటెల్‌, కోటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ - ఫైనాన్స్‌, అదానీపోర్ట్స్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 2.50శాతం నుంచి 5శాతం నష్టపోగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటాస్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 3శాతం నుంచి 6శాతం లాభపడ్డాయి.



You may be interested

బడ్జెట్‌తో ప్రభావితమయ్యే రంగాలు ఇవే!

Wednesday 30th January 2019

రాబోయే బడ్జెట్‌లో ప్రజాకర్షక విధానాలకు పెద్దపీట ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌తో ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలు, వాటిలోని కీలక కంపెనీలపై అనలిస్టుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... 1. అగ్రి, టెక్స్‌టైల్‌, ఫుట్‌వేర్‌:  - గ్రామీణ అగ్రి మార్కెట్స్‌, క్రిషి సిచాయ్‌ యోజనకు కేటాయింపులు పెరగవచ్చు. సాగు రంగానికి సంస్థాగత రుణపరిమితిని రూ. 11 లక్షల కోట్ల నుంచి పెంచవచ్చు. దీంతో పైప్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలకు లబ్ది కలుగుతుంది. ఫినొలెక్స్‌, హెచ్‌యూఎల్‌,

నిఫ్టీలో మార్పులు!

Wednesday 30th January 2019

త్వరలో నిఫ్టీ ఇండెక్స్‌లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం రెండు మార్లు నిఫ్టీ50ని రివ్యూ చేస్తారు. షేర్ల పనితీరును బట్టి కొన్నింటి చేర్చడం కొన్నింటిని తీసివేయడం చేస్తుంటారు. జనవరి నుంచి జూన్‌, జూన్‌ నుంచి జనవరి మధ్య కాలాన్ని పరిశీలించి నిఫ్టీలో మార్పులు చేస్తారు. ఈ దఫా గతంలోలాగా షేరు పనితీరు పరిశీలనకు  ఆరునెలల సమయాన్ని కాకుండా మూడు నెలల సమయాన్నే తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీలో జరగబోయే

Most from this category