STOCKS

News


భారీ నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 4th March 2019
Markets_main1551681881.png-24419

భారత్‌ - పాక్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రతరం కావడంతో విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌సీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం భారీ నష్టాలతో  10,842.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10917.05 పాయింట్లతో పోలిస్తే 75పాయింట్ల నష్టంతో ఉంది. ఇక భారత్ - పాక్‌ల మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నేటి ఉదయం గం.3:00లకు అక్నూర్‌ సెక్టార్‌లో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ ఆర్మీ కాల్పులు జరిపింది. దాదాపు పా 4 గంటల పాటు కాల్పులు జరిపినట్లు మీడియా వార్తలు వెలువడ్డాయి. చైనా- అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతుండటంతో ఆసియాలో తైవాన్‌ మార్కెట్‌ తప్ప ప్రధాన మార్కెట్లన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా చైనా మార్కెట్‌ 3శాతానికి పైగా లాభపడింది.



You may be interested

 మార్చి సిరీస్‌లో నిఫ్టీకి 10,700 మంచి మద్దతు

Monday 4th March 2019

మార్చి డెరివేటివ్‌ సిరీస్‌లో నిఫ్టీకి 10,700 పాయింట్ల స్థాయి మంచి మద్దతుగా నిలుస్తుందన్న అంచనాల్ని ఐసీఐసీఐ డెరివేటివ్‌ హెడ్‌ అమిత్‌ గుప్తా వెల్లడించారు. మార్చి సిరీస్‌ కేవలం 14.2 మిలియన్‌ షేర్లతో (రోలోవర్స్‌) మొదలయ్యిందని, గత మూడేళ్లలో కొత్త సిరీస్‌ ఇంత తక్కువ రోలోవర్స్‌తో మొదలుకావడం ఇదే ప్రధమమని, కనిష్ట ఓపెన్‌ ఇంట్రస్ట్‌ కారణంగానే ఇటీవల మార్కెట్‌ కదకలికల శ్రేణి పరిమితంగా వుందని ఆయన వివరించారు. అయితే రోలోవర్‌ స్ప్రెడ్‌

ఫండ్స్‌ వయా వ్యాలెట్స్‌

Monday 4th March 2019

పేటీఎం మనీ, మొబిక్‌విక్‌, ఈటీమనీ, జెరోదా కాయిన్‌ ఇలా అందుబాటులోకి ఎన్నో యాప్స్‌ పెట్టుబడి, ఉపసంహరణ ఎంతో సులభం ఇన్వెస్టర్లు జాగ్రత్తగా మసలుకోవాలన్నది నిపుణుల సూచన ఆర్థిక సలహాదారుల సూచనతో చేస్తే లాభమే లేదంటే నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరిక మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఒకప్పుడు కొన్ని రోజులు పట్టే కార్యక్రమం. కానీ, ఇప్పుడు క్షణాల్లోనే ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు డిజిటల్‌ సాధనాలు ఉన్నాయి. అందులోనూ అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌ నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలు కల్పించే

Most from this category