STOCKS

News


మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Tuesday 18th December 2018
Markets_main1545104738.png-23014

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 46 పాయింట్ల నష్టంతో 10,867 పాయింట్ల వద్ద ఉంది. 

♦ఆర్‌బీఐపై ప్రభుత్వం అదే పనిగా చేస్తున్న తీవ్ర స్థాయి ఒత్తిడి అన్నది... బ్యాంకింగ్‌ రంగం మెరుగు కోసం చేస్తున్న గట్టి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని, దీర్ఘకాలంలో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ హెచ్చరించింది. 

♦క్రూడ్‌ ధరలు మంగళవారం 1 శాతం మేర క్షీణించాయి. అమెరికా నిల్వలు పెరగడం ఇందుకు కారణం. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 49.35 వద్ద కదలాడుతోంది. 

♦ఇండియన్‌ రూపాయి సోమవారం 34 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.56 వద్ద ముగిసింది. 

♦మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్ల నుంచి ఏఎంసీలు వసూలు చేసే చార్జీలకు కోత విధిస్తూ సెబీ నూతన నిబంధనలను విడుదల చేసింది. వచ్చే ఏప్రిల్‌ నుంచి నూతన చార్జీలను ఏఎంసీలు విధిగా అమలు చేయాల్సి ఉంటుంది. 

♦అమెరికా మార్కెట్ల పతనం కారణంగా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 50 పాయింట్ల నష్టంతో 3,064 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 55 పాయింట్ల నష్టంతో 9,732 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 15 పాయింట్ల నష్టంతో 2,583 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 8 పాయింట్ల నష్టంతో 2,063 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 183 పాయింట్ల నష్టంతో 25,905 పాయింట్ల వద్ద, జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225... ఏకంగా 264 పాయింట్ల నష్టంతో 21,242 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦అమెరికా మార్కెట్లు సోమవారం పతనమయ్యాయి. ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పడిపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.11 శాతం లేదా 507 పాయిం‍ట్ల నష్టంతో 23,592 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండెక్స్‌కు ఇది 14 నెలల కనిష్ట స్థాయి. ఎస్‌అండ్‌పీ 500.. 2.08 శాతం లేదా 54 పాయింట్ల నష్టంతో 2,545 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.27 శాతం లేదా 157 పాయింట్ల నష్టంతో 6,753 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనల నేపథ్యంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వు పాలసీ సమావేశం కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లను సంబంధించి ఫెడ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆందోళనగా ఉన్నారు.  



You may be interested

నిఫ్టీ 40 పాయింట్లు గ్యాప్‌డౌన్‌

Tuesday 18th December 2018

నష్టాల్లో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు 10,850 దిగువకు నిఫ్టీ సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా డౌన్‌ సోమవారం లాభాలతో కళకళలాడిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,888 పాయింట్లతో పోలిస్తే 38 పాయింట్ల నష్టంతో 10,850 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,270 పాయింట్లతో పోలిస్తే 44 పాయింట్ల నష్టంతో 36,226 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది బెంచ్‌మార్క్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Tuesday 18th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 46 పాయింట్ల నష్టంతో 10,867 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,910 పాయింట్లతో పోలిస్తే 43 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category