STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Friday 30th November 2018
Markets_main1543549534.png-22498

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే... 

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 32 పాయింట్ల లాభంతో 10,947 పాయింట్ల వద్ద ఉంది. 

♦ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7-7.4 శాతం శ్రేణిలో వృద్ధి చెందొచ్చని ఎన్‌సీఏఈఆర్‌ అంచనా వేసింది. 

♦ ఇండియన్‌ రూపాయి నవంబర్‌ 29న 77 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.85 వద్ద ముగిసింది. 

♦ క్రూడ్‌ ధరలు శుక్రవారం తగ్గాయి. అమెరికాలో క్రూడ్‌ నిల్వలు పెరగడం ఇందుకు కారణం. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 51.3 డాలర్ల వద్ద ఉంది. 

♦ కమోడిటీ ట్రేడింగ్‌ సమయాన్ని సెబీ మరికొన్ని గంటలు పెంచే అవకాశముంది. 

♦ఆర్‌బీఐ.. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి అసెట్‌ సెక్యురిటైజేషన్‌ నిబంధనలను సరళీకరించింది. 

♦ఆర్‌బీఐ.. ఎంఎస్‌ఎంఈ ఎగుమతిదారులకు వడ్డీ సబ్సిడీని 5 శాతానికి పెంచింది. 

♦కోల్డ్‌ఎక్స్‌ తాజాగా సెబీకి  ఐపీవోకు దరఖాస్తు పత్రాలను సమర్పించింది. 

♦అమెరికా మార్కెట్లు గురువారం నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.11 శాతం లేదా 28 పాయిం‍ట్ల నష్టంతో 25,338 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.22 శాతం లేదా 6 పాయింట్ల నష్టంతో 2,737 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.25 శాతం లేదా 19 పాయింట్ల నష్టంతో 7,273 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ షేర్లు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. 

♦కొస్పి, నికాయ్‌ మినహా మిగతా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 13 పాయింట్ల లాభంతో 3,122 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 49 పాయింట్ల లాభంతో 9,934 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 11 పాయింట్ల లాభంతో 2,578 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 6 పాయింట్ల నష్టంతో 2,108 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 192 పాయింట్ల లాభంతో 26,642 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 1 పాయింటు నష్టంతో 22,261 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 30th November 2018

10,900 పైన ట్రేడవుతోన్న నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఐదో రోజూ పెరిగింది. శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,858 పాయింట్లతో పోలిస్తే 34 పాయింట్ల లాభంతో 10,892 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,170 పాయింట్లతో పోలిస్తే 134 పాయింట్ల లాభంతో 36,304 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ వెంటనే 10,900 మార్క్‌ను అధిగమించింది.  దేశ ఆర్థిక వ్యవస్థ

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 30th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 32 పాయింట్ల లాభంతో 10,947 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,855 పాయింట్లతో పోలిస్తే 92 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా మిశ్రమంగానే ట్రేడవుతున్నాయి.

Most from this category