STOCKS

News


36,060-35,985 మద్దతు శ్రేణి కీలకం

Monday 1st October 2018
Markets_main1538372436.png-20742

అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌ మొదలైన తర్వాత అమెరికాతో సహా ప్రపంచ మార్కెట్లన్నింటినీ తలదన్ని పెరిగిన భారత్‌ మార్కెట్‌...ప్రస్తుతం ఇతర మార్కెట్లు కోలుకునే ప్రయత్నం చేస్తుంటే. మన సూచీలు పడిపోతున్నాయి. దేశీయ బాండ్ల మార్కెట్లో కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల బాండ్లను ఫండ్స్‌ తెగనమ్మడం, ప్రభుత్వం ప్రకటించిన చర్యలు రూపాయి రికవరీకి సహకరించకపోవడం వంటి అంశాలు స్థానిక మార్కెట్‌ను దెబ్బతీసినట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో మరో రెండు వారాల్లో ద్వితీయ త్రైమాసిక ఫలితాల వెల్లడి ప్రారంభంకానున్నది. తొలుత ఫలితాల్ని వెల్లడించబోయే ఐటీ కంపెనీల లాభదాయకతపై ఇప్పటికే మార్కెట్లో మంచి అంచనాలు వున్నాయి. అందుకు అనుగుణంగా ఈ షేర్లు ఇటీవలి మార్కెట్‌ పతనంలో కూడా స్థిరంగా ట్రేడయినందున, రాబోయే రోజుల్లో ఈ షేర్ల కదలికలు మార్కెట్‌కు కీలకం. ఇక మన ప్రధాన సూచీల సాంకేతికాంశాలు ఇలా వున్నాయి.... 

సెన్సెక్స్ సాంకేతికాలు..
గత మార్కెట్‌ పంచాంగంలో సూచించిన రీతిలోనే 37,340 పాయింట్లను దాటలేకపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌, డౌన్‌ట్రెండ్‌ వేగవంతమై 35,990 పాయింట్ల వరకూ పతనం కొనసాగించింది.  సెప్టెంబర్‌ 28తో ముగిసినవారంలో చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 614 పాయింట్ల నష్టంతో 36,227 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాలుగా జరుగుతున్న లోయర్‌ టాప్‌, లోయర్‌ బోటమ్‌ ఫార్మేషన్‌లో మార్పు జరిగేంతవరకూ సెన్సెక్స్‌ కరెక‌్షన్‌ బాటలోనే వుంటుందని ఛార్టులు సూచిస్తున్నాయి. ఈ వారం సెన్సెక్స్‌కు 36,060-35,985 పాయింట్ల వద్ద లభించబోయే మద్దతు కీలకమైనది. గత ఆరు రోజులుగా మూడు దఫాలుగా సెన్సెక్స్‌ను పరిరక్షించిన ఈ మద్దతుశ్రేణిని కోల్పోతే పతనం కొనసాగి 200 రోజుల చలన సగటు (200 డీఎంఏ) రేఖ కదులుతున్న 35,320 పాయింట్ల స్థాయికి పడిపోవొచ్చు. ఈ స్థాయిని కూడా వదులుకుంటే 34,968 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం తొలి మద్దతుశ్రేణిని పరిరక్షించుకున్నా, గ్యాప్‌అప్‌తో మార్కెట్‌ మొదలైనా 36,330 పాయింట్ల వద్ద తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన స్థిరపడితే 36,710 పాయింట్లస్థాయికి పెరగవచ్చు. అటుపైన 36,945 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.  

నిఫ్టీ కీలక మద్దతు శ్రేణి 10,880-10,850
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ గత కాలమ్‌లో సూచించినట్లే 10,850పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. చివరకు 10,930 పాయింట్ల వద్ద ముగిసింది. వారంలో మొత్తంమీద 213 పాయింట్లు నష్టపోయింది.  ఈ వారం నిఫ్టీకి 10,880-10,850 పాయింట్ల శ్రేణి వద్ద కీలకమైన మద్దతు లభిస్తున్నది. కొద్దిరోజుల నుంచి పలు దఫాలుగా మద్దతునిచ్చిన ఈ శ్రేణిని కోల్పోతే వేగంగా 200 డీఎంఏ రేఖ కదులుతున్న 10,760 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. సాంకేతికంగా కీలకమైన ఈ స్థాయిని కూడా వదులుకుంటే 10,640 పాయింట్ల వద్దకు (మార్చి 23 నాటి 9,952 పాయింట్ల నుంచి ఆగస్టు 29 నాటి 11,760 పాయింట్ల వరకూ జరిగిన ర్యాలీలో ఇది 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి)తగ్గవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగినా, గ్యాప్‌అప్‌తో మొదలైనా 10,960 పాయింట్ల వద్ద తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన 11,090 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 11,170 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. You may be interested

గృహ రుణం ముందే తీరిస్తే లాభమేనా ?  

Monday 1st October 2018

ప్ర: నేను ఏడాది క్రితం డీఎస్‌పీ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో రూ. 2 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాను. ఇతర స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్‌ పనితీరు బాగా లేదు. ఈ ఫండ్‌ నుంచి మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని కెనరా రెబొకో లేదా రిలయన్స్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. లేదంటే  డీఎస్‌పీ స్మాల్‌ క్యాప్‌ఫండ్‌ నుంచి వెనక్కి తీసుకున్న మొత్తాన్ని రెండు సమాన భాగాలుగా చేసి,

సేవల్లో సంస్కరణలతో వృద్ధికి ఊతం

Monday 1st October 2018

వాషింగ్టన్‌: దీర్ఘకాలికంగా ఎకానమీ వృద్ధి మెరుగుపడేందుకు సేవల రంగంలో సంస్కరణలు తోడ్పడతాయనడానికి భారత్‌ నిదర్శనమని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో పేర్కొన్నాయి. 1990లలో భారత్‌లో ప్రవేశపెట్టిన సంస్కరణలు మరింత స్వేచ్ఛా వాణిజ్యానికి, మెరుగైన నియంత్రణ విధానాలు, భారీగా పెట్టుబడుల ఆకర్షణకు ఉపయోగపడ్డాయని నివేదిక వివరించింది. దేశ, విదేశీ సంస్థల నుంచి భారత తయారీ సంస్థలు సర్వీసులు పొందేందుకు, పోటీ

Most from this category