STOCKS

News


మార్కెట్‌ పయనం ఎటు?

Wednesday 17th October 2018
Markets_main1539747892.png-21214

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ కంపెనీలు ఎర్నింగ్స్‌ అదిరిపోవడంతో అమెరికా మార్కెట్‌ మంగళవారం లాభాల్లో ముగిసింది. యునైటెడ్‌ హెల్త్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ వంటి దిగ్గజ కంపెనీలు బలమైన ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. అలాగే ఆర్థిక గణాంకాలు పటిష్టంగా ఉండటం మరో సానుకూల అంశం. దీంతో ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పెరిగాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.17 శాతం లేదా 547 పాయిం‍ట్ల లాభంతో 25,798 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.15 శాతం లేదా 59 పాయింట్ల లాభంతో 2,809 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.89 శాతం లేదా 214 పాయింట్ల లాభంతో 7,645 పాయింట్ల వద్ద ముగిసింది.
♦ అమెరికా మార్కెట్ల జోరు ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 358 పాయింట్ల లాభంతో 22,907 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 17 పాయింట్ల లాభంతో 25,462 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 49 పాయింట్ల లాభంతో 3,083 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 113 పాయిం‍ట్ల లాభంతో 10,093 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 11 పాయింట్ల లాభంతో 2,557 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 28 పాయింట్ల లాభంతో 2,173 పాయింట్ల వద్ద ఉన్నాయి.  
♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  
♦ క్రూడ్‌ ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. అమెరికా క్రూడ్‌ ఇన్వెంటరీలు తగ్గడం ప్రభావం చూపింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 81.77 డాలర్ల వద్ద ఉంది. 
♦ రూపాయి మంగళవారం 35 పైసలు లాభపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 73.48 వద్ద ముగిసింది. 
♦ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మైండ్‌ట్రీ, హావెల్స్‌ సహా 14 కంపెనీలు బుధవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి.
♦ ఈక్విటీ మార్కెట్‌ జోరు మీద ఉండటంతో మూడు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5.30 లక్షల కోట్లమేర పెరిగింది.
♦ పీ-నోట్‌ ఇన్వెస్ట్‌మెంట్లు సెప్టెంబర్‌లో 9 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రూ.79,548 కోట్లుగా నమోదయ్యాయి. 



You may be interested

నిఫ్టీ 100 పాయింట్ల గ్యాప్‌అప్‌

Wednesday 17th October 2018

35,500 పాయింట్లకు పైన సెన్సెక్స్‌ 10,700 మార్క్‌ తాకిన నిఫ్టీ   ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నాల్గవ సెషన్‌ బుధవారం కూడా లాభాలతోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,162 పాయింట్లతో పోలిస్తే 381 పాయింట్ల లాభంతో 35,543 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,543 పాయింట్లతో పోలిస్తే 104 పాయింట్ల లాభంతో 10,688 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ వెంటనే 10,710

భారీ లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Wednesday 17th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం భారీ లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:48 సమయంలో 124 పాయింట్ల లాభంతో 10,709 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,589 పాయింట్లతో పోలిస్తే 120 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ బుధవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాలతో కళకళలాడతున్నాయి.

Most from this category