STOCKS

News


మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Tuesday 16th October 2018
Markets_main1539661529.png-21176

ఈక్విటీ మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా ఇండెక్స్‌లు లాభాల్లో ఉండటం, అమెరికా మార్కెట్లు నష్టపోవడం ఇందుకు కారణం. అధిక క్రూడ్‌ ధరలు బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లపై ప్రభావం చూపవచ్చు. లాభాల్లో ప్రారంభమైన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రస్తుతం నష్టాల్లో ట్రేడవుతోంది. 

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ వడ్డీ రేట్లు, కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై నెలకొని ఉన్న ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మరీముఖ్యంగా టెక్నాలజీ స్టాక్స్‌ నష్టపోవడం వల్ల ఇండెక్స్‌లు పడిపోయాయి. దీంతో అమెరికా మార్కెట్‌ సోమవారం నష్టాల్లోనే ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 89 పాయిం‍ట్ల నష్టంతో 25,250 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 16 పాయింట్ల నష్టంతో 2,750 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 66 పాయింట్ల నష్టంతో 7,430 పాయింట్ల వద్ద ముగిసింది.
♦ ఒక్క సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 136 పాయింట్ల లాభంతో 22,407 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 32 పాయింట్ల లాభంతో 25,476 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 1 పాయింటు నష్టంతో 3,044 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 66 పాయిం‍ట్ల లాభంతో 9,967 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 9 పాయింట్ల లాభంతో 2,577 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 6 పాయింట్ల లాభంతో 2,151 పాయింట్ల వద్ద ఉన్నాయి. 
♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ లేదా నెగటివ్‌ లేదా ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  
♦ రూపాయ సోమవారం మళ్లీ క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 26 పైసలు నష్టపోయి 73.83 వద్ద ముగిసింది. ఒకానొక సమయంలో 74 మార్క్‌ దిగువకు కూడా పడిపోయింది.
♦ బీఎస్‌ఈలో లిస్టైన 9 కంపెనీలు మంగళవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇందులో ఫెడరల్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హీరో మోటొకార్ప్‌ వంటి కంపెనీలున్నాయి. 
♦ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సెప్టెంబర్‌ క్వార్టర్‌లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో వాటాను 3.19 శాతానికి పెంచుకున్నారు. కాగా సెప్టెంబర్‌ క్వార్టర్‌లో స్టాక్‌ 57 శాతంమేర పతనమైంది.
♦ వాణిజ్య లోటు సెప్టెంబర్‌లో ఐదు నెలల కనిష్ట స్థాయికి తగ్గింది. 13.98 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఆగస్ట్‌లో ఇది 17.39 బిలియన్‌ డాలర్లు. గతేడాది సెప్టెంబర్‌లో వాణిజ్య లోటు 9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 
♦ విదేశీ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు అక్టోబర్‌ నెలలో ఇప్పటి దాకా దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి 2.35 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. 2016 నవంబర్‌ నుంచి చూస్తే ఈ స్థాయిలో విక్రయించడం ఇదే తొలిసారి. అప్పుడు 2.6 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. 

మార్కెట్లు శుక్రవారం లాభాలను సోమవారం కూడా కొనసాగించాయి. నిఫ్టీ 10,500 మార్క్‌ పైన క్లోజయ్యింది. నిఫ్టీ-50 ఇండెక్స్‌ డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్స్‌లో డ్రాగన్‌ఫ్లై డోజి రకపు ప్యాట్రన్‌ను ఏర్పరచింది. ఇది హ్యామర్‌ మాదిరి కనిపిస్తోంది.    
నిఫ్టీ-50.. సోమవారం 10,524 వద్ద ప్రారంభమైంది. తర్వాత రేంజ్‌బౌండ్‌లో కదలాడింది. అయితే చివరిలో 40 పాయింట్లు పెరిగి 10,512 పాయింట్ల వద్ద ముగిసింది.  ట్రేడర్లు 10,390 స్థాయిలో స్టాప్‌లాస్‌తో, 10,770 టార్గెట్‌తో ట్రేడ్‌ చేయవచ్చని మార్కెట్లు నిపుణులు సూచిస్తున్నారు. 



You may be interested

లాభాలతో బోణి..

Tuesday 16th October 2018

35,000 పాయింట్లకు పైన సెన్సెక్స్‌ 10,550 వద్ద నిఫ్టీ ప్రారంభం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం కూడా లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,865 పాయింట్లతో పోలిస్తే 139 పాయింట్ల లాభంతో 35,004 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,512 పాయింట్లతో పోలిస్తే 38 పాయింట్ల లాభంతో 10,550 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   వడ్డీ రేట్లు సహా కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై నెలకొని ఉన్న

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు..

Tuesday 16th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 2 పాయింట్ల నష్టతో 10,517 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,517 పాయింట్లతో పోలిస్తే సమానంగా ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా లాభాల్లో లేదా నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ

Most from this category