STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Monday 10th December 2018
Markets_main1544413426.png-22781

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 141 పాయింట్ల నష్టంతో 10,598 పాయింట్ల వద్ద ఉంది. 

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 42 పాయింట్ల నష్టంతో 3,069 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 109 పాయింట్ల నష్టంతో 9,651 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 22 పాయింట్ల నష్టంతో 2,583 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 24 పాయింట్ల నష్టంతో 2,051 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 426 పాయింట్ల నష్టంతో 25,637 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 487 పాయింట్ల నష్టంతో 21,191 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పడిపోతే. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ ఏకంగా 3 శాతానికి పైగా పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.24 శాతం లేదా 559 పాయిం‍ట్ల నష్టంతో 24,388 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.33 శాతం లేదా 63 పాయింట్ల నష్టంతో 2,633 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 3.05 శాతం లేదా 219 పాయింట్ల నష్టంతో 6,969 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్థిక వృద్ధి మందగమనం, నవంబర్‌ ఉద్యోగ గణాంకాలు అంచనాల కన్నా తక్కువగా నమోదు కావడం, వాషింగ్టన్‌- బీజింగ్‌ మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతల పెరగడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్లు పడిపోయాయి. మార్చి నుంచి చూస్తే ఇండెక్స్‌లు వారం వారీగా ఈ స్థాయిలో నష్టపోవడ ఇదే ప్రథమం. వారంలో ఇండెక్స్‌లు 4 శాతానికి పైగా క్షీణించాయి.

♦ ఒపెక్‌ దేశాల ఆయిల్‌ సరఫరా తగ్గింపు నిర్ణయంతో క్రూడ్‌ ధరలు సోమవారం పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 62.15 డాలర్ల వద్ద ఉంది. 

♦ భారత్‌ విదేశీ మారక నిల్వలు నవంబర్‌ 30తో ముగిసిన వారంలో 932.8 మిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 393.72 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 

♦ అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో దాదాపు రూ.400 కోట్లను వెనక్కు తీసుకెళ్లారు. 

♦ రూపాయి డిసెంబర్‌ 7న 23 పైసలు లాభపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.67 డాలర్ల వద్ద ముగిసింది. 

♦ డిన్యూక్లియరైజేషన్‌కు కట్టుబడి ఉన్నట్లు ఉత్తర కొరియా.. చైనాకు తెలిపింది. 

♦ రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం (నేడు) తీర్పునిచ్చే అవకాశాలు ఉన్నాయి. 

♦ భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీలో 2.9 శాతానికి పెరిగింది.



You may be interested

మార్కెట్‌ క్రాష్‌

Monday 10th December 2018

సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌ 10,500 సమీపంలోకి నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,693 పాయింట్లతో పోలిస్తే 185 పాయింట్ల నష్టంతో 10,508 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,673 పాయింట్లతో పోలిస్తే 469 పాయింట్ల నష్టంతో 35,204 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సమయం పెరిగే కొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:22

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పతనం

Monday 10th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 141 పాయింట్ల నష్టంతో 10,598 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,735 పాయింట్లతో పోలిస్తే 137 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ భారీ నష్టాల్లో

Most from this category