STOCKS

News


మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Thursday 6th December 2018
Markets_main1544068606.png-22675

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:51 సమయంలో 105 పాయింట్ల నష్టంతో 10,728 పాయింట్ల వద్ద ఉంది. 

♦ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే ఏడాది ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించొద్దని ఒపెక్‌ దేశాలను కోరారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ ధరలు బాగా పెరగొచ్చని తెలిపారు. కాగా ఒపెక్‌ దేశాలు డిసెంబర్‌ 6న వియన్నాలో సమావేశం కానున్నాయి. 

♦ క్రూడ్‌ ధరలు గురువారం తగ్గాయి. నేడు జరగనున్న ఒపెక్‌ దేశాల సమావేశంలో క్రూడ్‌ సరఫరాను తగ్గించే నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాలున్నాయి. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 52.57 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 61.39 డాలర్ల వద్ద కదలాడుతోంది.  

♦ ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ద్రవ్యోల్బణ అంచనాలను 2.7-3.2 శాతానికి తగ్గించింది.

♦ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఊతమిచ్చే పాలసీకి క్యాబినేట్‌ ఆమోద ముద్ర వేయవచ్చు. 

♦ ఆర్‌బీఐ.. ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యం పరిష్కారం కోసం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయనుంది.

♦ ఇండియన్‌ రూపాయి డిసెంబర్‌ 5న 3 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.46 వద్ద ముగిసింది. 

♦ ఇంట్రెస్ట్‌ రేట్‌ డెరివేటివ్‌ మార్కెట్‌లో ఎన్‌ఆర్‌ఐలు పాల్గొనేందుకు ఆర్‌బీఐ నిబంధనలను విడుదల చేసింది. 

♦ అమెరికా మార్కెట్ల పతనం నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 40 పాయింట్ల నష్టంతో 3,115 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 192 పాయింట్ల నష్టంతో 9,724 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 28 పాయింట్ల నష్టంతో 2,622 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 26 పాయింట్ల నష్టంతో 2,075 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 736 పాయింట్ల నష్టంతో 26,082 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 404 పాయింట్ల నష్టంతో 21,514 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కొస్పి, షాంఘై ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా.. నికాయ్‌, తైవాన్‌, హాంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌లు రెండు శాతానికి పైగా పడిపోయాయి. కెనడా అధికారులు హువావే సీఎఫ్‌వోను అరెస్ట్‌ చేశారు. దీని వల్ల అమెరికా, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగొచ్చనే భయాలు ఏర్పడ్డాయి. 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 6th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు:  టాటా మోటర్స్‌:- బ్రిటన్‌ అనుబంధ సంస్థ జాగ్వర్‌ లేలాండ్‌ అమ్మకాలు నవంబర్‌ అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. గతేడాది ఇదే నవంబర్‌లో కంపెనీ మొత్తం 8895 యూనిట్లను విక్రయించగా, ఈ ఏడాది నవంబర్‌లో అమ్మకాలు 9055 యూనిట్లుగా నమోదయ్యాయి. జాగ్వార్‌ వాహన అమ్మకాలు క్షీణించాయి. ఈ నవంబర్‌లో 2716 జాగ్వర్‌ అమ్మకాలను జరపగా, గతేడాది ఇదే నెలలో ఏకంగా 6241 వాహనాలను విక్రయించింది.

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 100 పాయింట్లు పతనం

Thursday 6th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:51 సమయంలో 105 పాయింట్ల నష్టంతో 10,728 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,827 పాయింట్లతో పోలిస్తే 100 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Most from this category