STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Friday 28th September 2018
Markets_main1538105652.png-20653

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 55 పాయింట్ల (0.21 శాతం) లాభంతో 26,439 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 8 పాయింట్ల (0.28 శాతం) లాభంతో 2,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 52 పాయింట్ల (0.65 శాతం) లాభంతో 8,041 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు అమెరికా ఆర్థిక వ్యవస్థపై నమ్మకంతో ఉండటం సహా యాపిల్‌, అల్ఫాబెట్‌, ఫేస్‌బుక్‌ స్టాక్స్‌ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. ఎస్‌అండ్‌పీ 500 కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ 0.80 శాతంమేర ఎగసింది. ఇటీవలే ఇందులో కొన్ని మార్పులు చేసి, కొత్త పేరు పెట్టారు. ఇందులోనే ఫేస్‌బుక్‌, గూగుల్‌ పేరెంట్‌ అల్ఫాబెట్‌, ఇతర ఇంటర్నెట్‌ స్టాక్స్‌, మీడియా స్టాక్స్‌ ఉన్నాయి. 
♦ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 406 పాయింట్ల లాభంతో 24,202 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 2 పాయిం‍ట్ల స్వల్ప నష్టంతో 11,031 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 19 పాయింట్ల లాభంతో 3,255 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 17 పాయింట్ల లాభంతో 2,808 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 132 పాయింట్ల లాభంతో 27,847 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 9 పాయింట్ల నష్టంతో 2,346 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.    
♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. 
♦వచ్చే రెండేళ్ల కాలంలో అమెరికా ఎలాంటి చెప్పుకోదగ్గ మాం‍ద్యం పరిస్థితులను ఎదుర్కొకపోవచ్చని ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అంచనా వేశారు. అందువల్ల క్రమంగా రేట్ల పెంపు ఉంటుందని పేర్కొన్నారు.  
♦డబ్ల్యూటీవో తాజాగా 2019 గానూ వాణిజ్య వృద్ధి అంచనాలను 4.4 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గించింది. వాణిజ్య ఉద్రిక్తతలు, లిక్విడిటీ సరఫరా తగ్గడం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. 
♦భౌగోళిక రాజకీయ అస్థిరతలు, వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతినిందని, దీని ప్రభావం ఐపీవోలపై స్పష్టంగా కనిపిస్తోందని ఎర్నె‍స్ట్‌ అండ్‌ యంగ్‌ తెలిపింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో గ్లోబల్‌గా ఐపీవోలు 1,000కు తగ్గాయని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే 18 శాతం క్షీణత నమోదయ్యిందని తెలిపింది. 
♦ఐదో విడత ఎలక్ట్రోరల్‌ బాండ్లను అక్టోబర్‌ 1 నుంచి 10 వరకు విక్రయిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపిక చేసిన ఎస్‌బీఐ బ్రాంచ్‌లలో వీటిని పొందొచ్చని పేర్కొంది. 
♦ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం ఫ్లాట్‌గా 72.59 వద్ద ముగిసింది. 
♦మార్కెట్లో చోటుచేసుకున్న లిక్విడిటీ సమస్య నేపథ్యంలో ఆర్‌బీఐ.. మ్యూచువల్‌ ఫండ్లకు ప్రత్యేకమైన విండోను ఏర్పాటు చేయాలని హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెకి మిస్త్రీ కోరారు.
♦ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ శుక్రవారం మార్కెట్‌లో లిస్ట్‌ కానుంది.
♦దినేశ్‌ ఇంజినీర్స్‌ ఐపీవో శుక్రవారం ప్రారంభమౌతుంది. 
 
నిఫ్టీ-50.. బుధవారం లాభాల్లోనే ఆరంభమైంది. 11,079 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 11,089 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే తర్వాత ఇంట్రాడేలో 10,953 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 76 పాయింట్ల నష్టంతో 10,977 పాయింట్ల వద్ద ముగిసింది.    
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 10,924, 10,870 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 11,060, 11,142 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు.
బ్యాంక్‌ నిఫ్టీ 334 పాయింట్ల నష్టంతో 25,042 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 24,882, 24,721 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 25,327, 25,612 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 



You may be interested

లాభాల ప్రారంభం

Friday 28th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,324 పాయింట్లతో పోలిస్తే 128 పాయింట్ల లాభంతో 36,452 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,977 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో 11,008 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, వచ్చే రెండేళ్ల కాలంలో అమెరికా ఎలాంటి

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పైపైకి

Friday 28th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:28 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 51 పాయింట్ల లాభంతో 11,093 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,974 పాయింట్లతో పోలిస్తే 119 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ శుక్రవారం పాజిటివ్‌గా లేదా గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా

Most from this category