STOCKS

News


మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Monday 1st October 2018
Markets_main1538365272.png-20723

సోమవారం మార్కెట్లను ప్రభావితం అంశాలను గమనిస్తే..

♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్‌, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 18 పాయిం‍ట్ల లాభంతో 26,458 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. కేవలం 0.02 పాయింటు అతిస్వల్ప నష్టంతో 2,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4 పాయింట్ల లాభంతో 8,046 పాయింట్ల వద్ద ముగిసింది. వాణిజ్య ఉద్రిక్తత భయాలు మార్కెట్‌ లాభాలను పరిమితం చేశాయి. అమెరికా, కెనడా దేశాలు వాణిజ్య భాగస్వామ్యానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఒప్పందానికి రాలేదు. గడువు దగ్గరపడ్డా కూడా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. 
♦ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 143 పాయింట్ల లాభంతో 24,263 పాయింట్ల వద్ద ఉంది. హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ మార్కెట్‌కు సెలవు. ఇది శుక్రవారం 73 పాయింట్ల లాభంతో 27,788 పాయింట్లకు పెరిగింది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 4 పాయింట్ల లాభంతో 3,261 పాయింట్లకు ఎగసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 32 పాయిం‍ట్ల లాభంతో 11,038 పాయింట్ల వద్ద ఉంది. చైనా మార్కెట్‌కు సెలవు. శుక్రవారం చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 30 పాయింట్ల లాభంతో 2,821 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల నష్టంతో 2,338 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 
♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ లేదా పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦బ్రెంట్‌ క్రూడ్‌ ధర సోమవారం పెరిగింది. ధర నాలుగేళ్ల గరిష్ట స్థాయికి దగ్గరిలో ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 83.04 డాలర్ల వద్ద ఉంది. 0.4 శాతం పెరిగింది.
♦అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం 11 పైసలు బలపడి 72.48 వద్ద ముగిసింది. 
♦అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, రూపాయి క్షీణత వంటి అంశాల వల్ల ఇండియన్‌ ఎగుమతులు పెరుగుతాయని అసోచామ్‌ పేర్కొంది.
♦విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి సెప్టెంబర్‌ నెలలో ఏకంగా రూ.21,000 కోట్లమేర నిధులను వెనక్కు తీసుకెళ్లారు. ఈ స్థాయిలో నిధులను ఉపసంహరించుకోవడం గత నాలుగు నెలల్లో ఇదే అధికం.
♦చైనా నవంబర్‌ 1 నుంచి టైక్స్‌టైల్‌ ప్రొడక్ట్స్‌, మెటల్స్‌, స్టీల్‌ ప్రొడక్ట్స్‌ వంటి పలు దిగుమతులపై సుంకాలను 11.5 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గించనుంది. 
♦ఎన్‌ఎస్‌ఈ అక్టోబర్‌ 12 నుంచి కమోడిటీ డెరివేటివ్స్‌ను ప్రారంభించనుంది.
♦బీఎస్‌ఈ అక్టోబర్‌ 1 నుంచి కమోడిటీ డెరివేటివ్స్‌ను ప్రారంభించనుంది. 
♦నర్మదా బయోకెమ్‌ ఐపీవోకు రానుంది. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 1st October 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌:- నాన్ కన్వర్టబుల్ డెట్ ఇష్యూ ద్వారా రూ. 15,000 కోట్ల దాకా నిధుల సమీకరణ ప్రతిపాదనకు సంస్థ ఇన్వెస్టర్లు ఆమోదముద్ర వేశారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌:-  ప్రముఖ రేటింగ్‌ను సంస్థ ఇండియా రేటింగ్స్‌...  కంపెనీ జారీ చేసిన రూ.310 కోట్ల కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు రేటింగ్‌ను తగ్గించింది. కరూర్‌వైశ్యా బ్యాంక్‌:- నియమనిబంధనలను ఉల్లఘించినందుకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ.5కోట్ల జరిమానాను

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Monday 1st October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 7 పాయింట్ల లాభంతో 10,966 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,954 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలు లాభాల్లో ఉన్నాయి. అమెరికా

Most from this category