News


మార్కెట్‌ ఎటువైపు?

Monday 10th September 2018
Markets_main1536551456.png-20103

నిఫ్టీ శుక్రవారం 11,558 వద్ద ప్రారంభమైంది. అయితే తర్వాత 11,500 దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 11,484 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే తర్వాత మళ్లీ పుంజుకొని 11,603 గరిష్ట స్థాయికి ఎగసింది. అయితే ఈ స్థాయిల్లో కొంత ప్రాఫిట్‌ బుకింగ్‌ చోటుచేసుకుంది. దీంతో ఇండెక్స్‌ 11,600 మార్క్‌కు దిగువకు వచ్చేసింది. చివరకు 52 పాయింట్ల నష్టంతో 11,589 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండెక్స్‌ డైలీ చార్ట్స్‌లో చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇది హ్యామర్‌ రకపు ప్యాట్రన్‌ మాదిరి ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి రికవరీ, క్రూడ్‌ ధరలు స్థిరంగా ఉండటం మార్కెట్‌కు బలాన్నిచ్చింది. ఆరు వారాలుగా పెరుగుతూ వచ్చిన ఇండెక్స్‌ గత వారంలో నష్టాల్లో క్లోజయ్యింది. 0.8 శాతంమేర క్షీణించింది. వీక్లి చార్ట్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. 
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,514, 11,440 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 11,633, 11,677 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 
బ్యాంక్‌ నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 27,481 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 27,305, 27,129 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 27,585, 27,688 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 79 పాయిం‍ట్ల నష్టంతో 25,916 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500 కేవలం 6 పాయింట్ల నష్టంతో 2,872 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 20 పాయింట్ల నష్టంతో 7,902 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. చైనా దిగుమతులపై అదనపు టారిఫ్‌లు విధించే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. యాపిల్‌ ప్రొడక్టులపై కూడా దీని ప్రభావం పడనుంది. 
♦ ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌, దక్షిణ కొరియా ఇండెక్స్‌లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 7 పాయింట్ల లాభంతో 22,314 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల లాభంతో 2,285 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఇక హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 274 పాయింట్ల నష్టంతో 26,698 పాయింట్ల వద్ద,  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 14 పాయింట్ల నష్టంతో 3,120 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 19 పాయింట్ల నష్టంతో 2,683 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 114 పాయిం‍ట్ల నష్టంతో 10,732 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ ఆజ్యం పోసుకోవడం ప్రతికూల ప్రభావం చూపింది.
♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.
♦ చైనా దిగుమతులపై అదనంగా 267 బిలియన్‌ డాలర్ల టారిఫ్‌లను విధించడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమౌతున్నారు. 
♦ జపాన్‌ జీడీపీ వృద్ధి రేటు ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 3 శాతంగా నమోదయ్యింది. ఇది నిపుణుల అంచనాలు మించింది. 2016 నుంచి చూస్తే ఇదే వేగవంతమైన వృద్ధి కావడం గమనార్హం. 
♦ చైనా, భారత్‌ వంటి దేశాలకు సబ్సిడీలను నిలిపివేస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు. 
♦ కరెంట్‌ అకౌంట్‌ లోటు ప్రస్తుత క్యూ1లో స్వల్పంగా 2.4 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో క్యాడ్‌ 2.5 శాతంగా నమోదయ్యింది.
♦ అమెరికాలో ఉత్పత్తి తగ్గడం, ఇరాన్‌పై ఆంక్షల కారణంగా క్రూడ్‌ ధరలు సోమవారం పెరిగాయి. 
♦ చిరిగిన నోట్ల మార్పిడీకి సంబంధించి విధి విధానాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం సవరించింది. 
♦ ఫారెక్స్‌ నిల్వలు ఆగస్ట్‌ 31తో ముగిసిన వారంలో 1.19 బిలియన్‌ డాలర్ల క్షీణతతో 400.1 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 
♦ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు ఆగస్ట్‌లో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.25 లక్షల కోట్లకు చేరాయి.
♦ విదేశీ ఇన్వెస్టర్లు గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.5,600 కోట్లను ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి వెనక్కు తీసుకున్నారు. 
♦ కేంద్ర ప్రభుత్వం.. ఈపీఎఫ్‌వో రెగ్యులేటరీ విధులను ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి దానికి అప్పగించాలని భావిస్తోంది. 
♦ కొత్త కేవైసీ నిబంధనలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) సెబీ  ఊరటనిచ్చింది. అలాగే కొత్త మార్గదర్శకాలకు తుది రూపు ఇచ్చే ముందు ఈ మార్పులపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని సెబీ నిర్ణయించింది. You may be interested

నష్టాలతో బోణి

Monday 10th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,389 పాయింట్లతో పోలిస్తే 41 పాయింట్ల నష్టంతో 38,348 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,589 పాయింట్లతో పోలిస్తే 19 పాయింట్ల నష్టంతో 11,570 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లోనే ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, చైనా దిగుమతులపై అదనంగా 267

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు డౌన్‌

Monday 10th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:41 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల నష్టంతో 11,585 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో శుక్రవారం నాటి ముగింపు 11,632 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా

Most from this category