STOCKS

News


మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Friday 12th October 2018
Markets_main1539315684.png-21059

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

► అమెరికా మార్కెట్‌ వరుసగా ఆరో సెషన్‌లోనూ గురువారం కూడా నష్టాల్లోనే ముగిసింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఆజ్యం పోసుకోవడం, వడ్డీ రేట్ల పెంపు భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆగస్ట్‌ 29 నుంచి నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 10.3 శాతంమేర క్షీణించింది.  ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ ఏకంగా ఏడాది కనిష్ట స్థాయికి పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 545 పాయిం‍ట్ల (2.13 శాతం) నష్టంతో 25,052 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 57 పాయింట్ల (2.06 శాతం) నష్టంతో 2,728 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 93 పాయింట్ల (1.25 శాతం) నష్టంతో 7,329 పాయింట్ల వద్ద ముగిసింది. 

► ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 102 పాయింట్ల నష్టంతో 22,488 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 100 పాయింట్ల లాభంతో 25,365 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ కేవలం 0.18 పాయింటు నష్టంతో 3,047 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 48 పాయిం‍ట్ల లాభంతో 9,854 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 42 పాయింట్ల నష్టంతో 2,541 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 18 పాయింట్ల లాభంతో 2,147 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

► ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.

► కరెంటు ఖాతా లోటు కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండో విడత కింద మరికొన్ని ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచింది. వీటిలో కమ్యూనికేషన్‌ ఉత్పత్తులు, బేస్‌ స్టేషన్‌, డిజిటల్‌ లైన్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. వీటిపై సుంకాలను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచింది.

► రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్ట్‌లో నికరంగా చూస్తే 2.323 బిలియన్‌ డాలర్లను విక్రయించింది.

► రూపాయి గురువారం కోలుకుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 9 పైసలు బలపడి 74.12 వద్ద ముగిసింది. 

► క్రూడ్‌ ధరలు శుక్రవారం స్థిరంగానే ఉన్నాయి. సరఫరా భయాలు తగ్గడం, గ్లోబల్‌గా ఈక్విటీ మార్కెట్లు పతనం కావడం వంటి అంశాలు ఇందుకు కారణం. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 80.39 డాలర్లుగా ఉంది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 71.08 డాలర్లుగా ఉంది. 

► ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్లను నెలవారీగా తెలియజేయాలని డిపాజిటరీ పార్టిసిపెంట్స్‌ను మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ కోరింది.

► దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ2లో రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 

► హెచ్‌యూఎల్‌ శుక్రవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. 


గ్లోబల్‌ మార్కెట్‌ కరెక‌్షన్‌ వల్ల గురువారం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ-50.. గురువారం గ్యాప్‌డౌన్‌తోనే ప్రారంభమైంది. ఇంట్రాడేలో 10,138 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 225 పాయింట్ల నష్టంతో 10,234 వద్ద ముగిసింది. 2018 ఏప్రిల్‌ 4 నుంచి చూస్తే ఇదే కనిష్ట ముగింపు స్థాయి. 
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 10,136, 10,039 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 10,334, 10,433 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు.
బ్యాంక్‌ నిఫ్టీ 537 పాయింట్ల నష్టంతో 24,783 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 24,538, 24,292 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 24,984, 25,185 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 
ఇండియా వీఐఎక్స్‌ 14.68 శాతం పెరుగుదలతో 20.53కి ఎగసింది. ఇది మార్కెట్‌లో బేర్స్‌ ఆధిపత్యాన్ని చూసిస్తోంది. వీఐఎక్స్‌ 17.50-17 జోన్‌కి వస్తే అప్పుడు మార్కెట్‌లో కన్సాలిడేషన్‌కు సాంకేతాలు వెలువడొచ్చని నిపుణులు పేర్కొన్నారు.  You may be interested

గ్యాప్‌అప్‌తో ఆరంభం..

Friday 12th October 2018

గురువారం కుదేలైన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,001 పాయింట్లతో పోలిస్తే 290 పాయింట్ల లాభంతో 34,291 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,234 పాయింట్లతో పోలిస్తే 97 పాయింట్ల లాభంతో 10,331 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   అమెరికా మార్కెట్‌ వరుసగా ఆరో సెషన్‌లోనూ గురువారం కూడా నష్టాల్లోనే ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Friday 12th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:43 సమయంలో 56 పాయింట్ల లాభంతో 10,335 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,252 పాయింట్లతో పోలిస్తే 83 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా

Most from this category