STOCKS

News


5 పైసలు బలహీనపడిన రూపాయి

Tuesday 4th December 2018
Markets_main1543897134.png-22602

  • డాలరుతో 70.51 వద్ద ప్రారంభం
  • సోమవారం ముగింపు 70.46

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభ సమయంలో స్వల్ప నష్టాలను నమోదుచేసింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 70.51 దగ్గర ప్రారంభమయ్యింది. 9 గంటల 15 నిమిషాల సమయానికి రికవరీ సాధించి 0.02 శాతం లాభాల్లో ట్రేడవుతోంది. ఈ సమయానికి 70.44 వద్ద ఉంది. ద్రవ్య, పరపతి విధాన నిర్ణయానికి సంబంధించి ఆర్‌బీఐ మూడు రోజల సమావేశం సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో మారకం విలువ ఫ్లాట్‌గా కొనసాగుతుందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక ఈ ఏడాదిలో రూపాయి విలువ 9.33 శాతం పతనమైంది. 

10-ఏళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌ ప్రస్తుతం 7.615 వద్ద ఉంది. క్రితం ముగింపు 7.626 శాతంగా ఉంది. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ 0.23 శాతం బలహీనపడింది. ప్రస్తుతం 96.816 వద్ద ట్రేడవుతున్న ఈ ఇండెక్స్‌ క్రితం ముగింపు 97.04గా నమోదైంది.You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 4th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇండియన్‌ సిమెంట్స్‌:- స్ప్రింగ్‌వే మైనింగ్‌ లిమిటెడ్‌లో 51శాతం వాటాను కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీ ఇండియన్‌ సిమెంట్‌కు అనుబంధ సంస్థగా మారునుంది. సన్‌ ఫార్మా:- ర్యాన్‌బ్యాక్సీ డీలింగ్‌లో కంపెనీపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ర్యాన్‌బ్యాక్సీ ఒప్పంద వ్యవహారంలో కంపెనీ ఎలాంటి నియమనిబంధల ఉల్లంఘనలకు పాల్పడలేదని వివరణనిచ్చింది. అలాగే ఇన్‌సైడ్‌ ట్రేడ్‌ కేసును రీ- ఓపెన్‌ చేస్తున్నట్లు సెబీ నుంచి కంపెనీకి ఎలాంటి నోటీసులు

ప్రారంభం ఫ్లాట్‌

Tuesday 4th December 2018

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సాంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం మిశ్రమంగానే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 36,290.48 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 10,877.10మ వద్ద ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ర్యాలీ చేయడంతో క్రితం రోజు ట్రేడింగ్‌లో 88పైసలు నష్టపోయి రూపాయి నేటి ట్రేడింగ్‌లో స్వల్పంగా బలహీనపడి సూచీలను వెనక్కిలాగుతుంది. అలాగే హెవీవెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, మహీం‍ద్రా అండ్‌ మహీంద్రా,

Most from this category