STOCKS

News


ఐఓసీ షేర్లకు బైబ్యాక్‌ బూస్టింగ్‌

Friday 14th December 2018
Markets_main1544772400.png-22932

ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 4శాతం లాభపడ్డాయి. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో రూ.4,435 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌తో పాటు, రూ.6,665 కోట్ల మధ్యంతర డివిడెంట్‌ చెల్లింపునకు అనుమతులు లభించడం షేర్ల ర్యాలీకి కారణమైంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐఓసీ షేర్లు రూ.141.15ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 4శాతం లాభపడి రూ.142.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:15ని.లకు షేరు గతముగింపు ధర(రూ.137.40)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.141.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.105.25లు, రూ.213లుగా నమోదయ్యాయి.
బై బ్యాక్‌, మధ్యంతర డివిడెంట్‌కు బోర్డు ఆమోదం:-
ఐఓసీ గురువారం జరిగిన బోర్డు సమావేశంలో రూ.4,435 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌తో పాటు, రూ.6,665 కోట్ల మధ్యంతర డివిడెంట్‌ చెల్లింపులకు అనుమతులు లభించాయి. బైబ్యాక్‌ ఇష్యూలో భాగంగా కంపెనీ 3.06శాతానికి సమానమైన 29.76 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్‌ను రూ.149 ధరకు బైబ్యాక్‌ చేయనుంది. ఈ బైబ్యాక్‌ ధర గురువారం ఐఓసీ షేరు ముగింపు ధర(రూ.137) కంటే 9శాతం అధికం. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.6.75 మధ్యంతర డివిడెంట్‌ను చెల్లించడానికి కూడా డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు ఐఓసీ తెలిపింది. మొత్తం డివిడెంట్‌ చెల్లింపులు రూ.6,665 కోట్లుగా కాగా, ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3,544 కోట్లు డివిడెండ్‌ను చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. ఈ డివిడెంట్‌ చెల్లింపునుకు రికార్డు తేది ఈ నెల 25 అని, ఈ నెల 31లోగా డివిడెంట్‌ మొత్తాన్ని వాటాదారులకు చెల్లిస్తామని ఐఓసీ వివరించింది.



You may be interested

బ్రోకరేజ్‌ పాంచ్‌ పటాకా

Friday 14th December 2018

లాంగ్‌టర్మ్‌ పెట్టుబడి కోసం ప్రముఖ బ్రోకరేజ్‌లు ఐదు స్టాకులను రికమండ్‌ చేస్తున్నాయి. 1. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌: మోర్గాన్‌ స్టాన్లీ సిఫార్సు. టార్గెట్‌ రూ. 1311. ఏవియేషన్‌ రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. వాల్యూషన్లు ఆకర్షణీయంగా మారాయి. రిస్కురివార్డు నిష్పత్తి పెట్టుబడికి అనుకూలంగా ఉంది. 2. ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్స్‌: మాక్క్వైరీ సిఫార్సు. టార్గెట్‌ రూ. 290. రాబోయే రోజుల్లో ఈ రంగంలో రికవరీ వస్తుందని అంచనా. వచ్చే మూడేళ్లలో షేరు ధర రెట్టింపు కావచ్చని

ఇండియన్‌ ఎకానమీ టేకాఫ్‌కు రెడీ: ఝున్‌ఝున్‌వాలా

Friday 14th December 2018

దిగ్గజ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తాజాగా మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోని వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికలను 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించడం లేదన్నారు. అయితే అధికారంలోకి ఎవ్వరొచ్చిన ప్రమాదమేమీ లేదని, భారత్‌ గొప్ప ప్రజాస్వామ్య దేశమని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మిడ్‌ క్యాప్స్‌ బాగా కరెక‌్షన్‌కు గురయ్యాయని పేర్కొన్నారు. లార్జ్‌ క్యాప్‌ కంపెనీల

Most from this category