STOCKS

News


మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Friday 7th December 2018
Markets_main1544154377.png-22711

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:46 సమయంలో 59 పాయింట్ల లాభంతో 10,683 పాయింట్ల వద్ద ఉంది. 

♦క్రూడ్‌ ధరలు శుక్రవారం నిలకడగానే ఉన్నాయి. అమెరికా క్రూడ్‌ నిల్వలు తగ్గడం ఇందుకు కారణం. అయితే సెంటిమెంట్‌ మాత్రం బలహీనంగానే ఉంది. ఒపెక్‌ దేశాలు ఆయిల్‌ సరఫరాపై తుది నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. అయితే రష్యా నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందో వేచి చూస్తున్నాయి. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 51.61 డాలర్ల వద్ద ఉంది. 

♦ఇండియన్‌ రూపాయి డిసెంబర్‌ 6న 44 పైసలు క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.90 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్‌ డిమాండ్‌ పెరుగుదల ఇందుకు కారణం. 

♦ఒపెక్‌ దేశాలు క్రూడ్‌ ధరల క్షీణతను అడ్డు కునేందుకు ఆయిల్‌ సరఫరా తగ్గించొచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. 

♦క్రూడ్‌ దిగుమతుల బిల్లును రూపాయిల్లో చెల్లించేందుకు ఇరాన్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 

♦ప్రైవేట్‌ ఈక్విటీ/ వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్లు 2018 జనవరి-నవంబర్‌ మధ్య కాలంలో 27 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2017లోని మొత్తం 26.1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల కన్నా ఇవి ఎక్కువ కావడం గమనార్హం. 

♦దేశంలో వ్యక్తుల మొత్తం సంపద విలువ 2020-23 ఆర్థిక సంవత్సరం కల్లా రూ.517.88 లక్షల కోట్లకు చేరొచ్చని కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ ఒక నివేదికలో పేర్కొంది. 

♦యూనిపార్ట్స్‌ ఇండియా ఐపీవోకు రానుంది. కంపెనీ ఐపీవో పత్రాలను సెబీకి సమర్పించింది. 

♦అమెరికా డాలర్‌- ఇండియన్‌ రూపాయి వీక్లి ఆప్షన్స్‌కు సెబీ నుంచి అనుమతి లభించిందని ఎంఎస్‌ఈ తెలిపింది. 

♦కేం‍ద్ర ప్రభుత్వం కోల్‌ ఇండియాలోని 2.21 శాతం వాటాను సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌కు విక్రయించింది. 

♦ఆర్‌ఈసీలో కేంద్ర ప్రభుత్వ వాటాను పీఎఫ్‌సీకి విక్రయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

♦అమెరికా మార్కెట్ల రికవరీ నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 12 పాయింట్ల లాభంతో 3,127 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 70 పాయింట్ల లాభంతో 9,754 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల నష్టంతో 2,600 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 1 పాయింటు నష్టంతో 2,067 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 17 పాయింట్ల లాభంతో 26,173 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 22 పాయింట్ల లాభంతో 21,524 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦అమెరికా మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. అయితే చివరకు రికవరీ అయ్యాయి. ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.32 శాతం లేదా 79 పాయిం‍ట్ల నష్టంతో 24,947 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.15 శాతం లేదా 4 పాయింట్ల నష్టంతో 2,695 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.42 శాతం లేదా 30 పాయింట్ల లాభంతో 7,188 పాయింట్ల వద్ద ముగిసింది. చైనాకు చెందిన టెలికం దిగ్గజ కంపెనీ హువావే ఎగ్జిక్యూటివ్‌ అరెస్ట్‌ నేపథ్యంలో అంతంత మాత్రంగానే ఉన్న అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై మళ్లీ తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుందని ఆందోళనలు ఇన్వెస్టర్లలో ప్రారంభమయ్యాయి. దీంతో మార్కెట్‌ భారీగా పతనమైంది. అయితే చివరకు ఇండెక్స్‌లు కోలుకున్నాయి. దాదాపుగా నష్టాలను పూడ్చుకున్నాయి. 



You may be interested

గ్యాప్‌అప్‌ మార్కెట్‌

Friday 7th December 2018

సెన్సెక్స్‌ 180 పాయింట్లు అప్‌ 10,650 సమీపంలో నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,601 పాయింట్లతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 10,644 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,312 పాయింట్లతో పోలిస్తే 182 పాయింట్ల లాభంతో 35,494 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది.  అమెరికా క్రూడ్‌ నిల్వలు తగ్గడం వల్ల క్రూడ్‌ ధరలు శుక్రవారం నిలకడగానే ఉండటం,

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 7th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:46 సమయంలో 59 పాయింట్ల లాభంతో 10,683 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,626 పాయింట్లతో పోలిస్తే 57 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category