STOCKS

News


ఈ పరుగులు చాలాఏళ్లుంటాయ్‌!

Wednesday 20th March 2019
Markets_main1553060410.png-24703

భారత మార్కెట్లు బహుళసంవత్సర ర్యాలీకి రెడీగా ఉన్నాయని ఈక్విటీ ఇంటిలిజెన్స్‌ ఎండీ పొరింజు వెలియత్‌ చెప్పారు. పదేళ్ల కన్సాలిడేషన్‌ అనంతరం మార్కెట్లు మరలా జూలు విదులుస్తున్నాయన్నారు. ఈదఫా ర్యాలీ కనీసం 4-5 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. మార్కెట్లు ఇప్పటికీ పూర్తిగా భారత ఎకానమీలోని సంపూర్ణ పాజిటివ్‌ అంశాలను ప్రతిబింబించడంలేదని చెప్పారు. దేశీయ పెట్టుబడిదారుల కన్నా ఎఫ్‌పీఐలే ఇండియాపై ఎక్కువ నమ్మకంతో ఉన్నారన్నారు. గత ఇరవై రోజుల్లో ఎఫ్‌ఐఐలు ఇండియా ఈక్విటీల్లో దాదాపు 500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయని, మనపై వారి నమ్మకానికి ఇదే నిదర్శనమని తెలిపారు. రంగాలవారీగా చూస్తే ఆటో రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, కానీ ప్రస్తుత ర్యాలీలో మార్కెట్‌తో పాటే ముందుకు సాగుతుందని అంచనా వేశారు. స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, సిమెంట్‌ స్టాకులు ఇటీవల భారీగా నష్టపోయాయని కానీ వాటి పతనం బాటమ్‌అవుట్‌ అయిందని తెలిపారు. సిమెంట్‌ రంగంలో ఓరియంట్‌ సిమెంట్‌, బ్యాంకుల్లో  ఐసీఐసీఐ, యాక్సిస్‌, బీఓబీ, ఎస్‌బీఐ, ఫెడరల్‌ బ్యాంక్‌ను ఆయన రికమండ్‌ చేశారు. ఐటీ రంగంలో ఎన్‌ఐఐటీ బెటరన్నారు. నాణ్యమైన పలు మిడ్‌క్యాప్‌లు భారీగా పతనమై ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద కనిపిస్తున్నాయని, వీటిలో సరైన వాటిని ఎంచుకోవచ్చని సూచించారు. 



You may be interested

ఆరు రోజుల ఎత్తు నుంచి కిందకు..!

Wednesday 20th March 2019

- 43 పైసల నష్టంతో  రూ.68.96కు రూపాయి - లాభాల స్వీకరణ కారణం! ము‍‍ంబై: ఆరు ట్రేడింగ్‌ సెషన్ల వరుస రూపాయి ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 43పైసలు నష్టపోయి 68.96 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు వచ్చిన డిమాండ్‌ తాజా రూపాయి బలహీనతకు కారణాల్లో ఒకటని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వరుసగా ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో దాదాపు 161 పైసలు లాభపడ్డంతో, కొందరు ట్రేడర్లు లాభాల

ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌పై ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ కన్ను

Wednesday 20th March 2019

ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌పై ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ కన్ను రూ.35వేల కోట్ల మార్కెట్లోకి త్వరలో రంగప్రవేశం ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపకల్పన న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ దిగ్గజాలు అమేజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌ (వాల్‌మార్ట్‌)లు భారత ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్లో అవకాశాలపై కన్నేశాయి. రూ.35,000 కోట్ల విలువతో, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌లోని అవకాశాలను చేజిక్కించుకునేందుకు అవి సన్నద్ధం అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, గ్రోసరీలతో ఈ కామర్స్‌లో ఈ రెండు సంస్థలు

Most from this category