STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Monday 19th November 2018
Markets_main1542599191.png-22156

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:53 సమయంలో 49 పాయింట్ల లాభంతో 10,747 పాయింట్ల వద్ద ఉంది. 

♦ కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఇందులో ఇరుపక్షాలు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం కనుగొనేందుకే ప్రాధాన్యం ఇవ్వనున్నప్పటికీ.. భేటీ కొంత వాడి, వేడిగా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద పీసీఏ నిబంధనలు, చిన్న సంస్థలకు రుణాల మంజూరు తదితర వివాదాస్పద అంశాలపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ టీమ్‌పై ఆర్థిక శాఖ నామినీలు, కొంతమంది స్వతంత్ర డైరెక్టర్లు అస్త్రాలు సంధించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

♦ అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ డౌజోన్స్‌తో వ్యాపార భాగస్వామ్యానికి ముగింపు పలకాలని బీఎస్‌ఈ నిర్ణయించింది. ఇరు సంస్థల మధ్య జాయింట్‌ వెంచర్‌ ‘ఆసియా ఇండెక్స్‌’ 2013లో ఏర్పాటైంది. ఇరు సంస్థలు కలసి బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ సహా పలు సూచీలను నిర్వహిస్తున్నాయి. అయితే, ఎస్‌అండ్‌పీ డౌజోన్స్‌తో చేసుకున్న ఒప్పందం కాల పరిమితి డిసెంబర్‌ 31తో తీరిపోతుందని, ఇకపై పునరుద్ధరించుకోవడం లేదని బీఎస్‌ఈ అధికారులు తెలిపారు. సొంతంగానే సూచీల అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.

♦ క్రూడ్‌ ధరలు సోమవారం పెరిగాయి. ఒపెక్‌ దేశాలు ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించాలని సౌదీ అరేబియం ఒత్తిడి తీసుకురావొచ్చనే అంచనాలు ఇందుకు కారణం. అలాగే అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా డిమాండ్‌ మందగమనం వల్ల మార్కెట్‌ సెంటిమెంట్‌ కూడా బలంగా లేదు. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 67.29 డాలర్లకు, అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 57.07 డాలర్లకు పెరిగాయి. 

♦ రూపాయి నవంబర్‌ 16న 4 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.93 వద్ద ముగిసింది. రూపాయికి ఇది రెండు నెలల గరిష్ట స్థాయి. 

♦ ఫారెక్స్‌ నిల్వలు నవంబర్‌ 9తో ముగిసిన వారంలో 121 మిలియన్‌ డాలర్ల తగ్గుదలతో 393.01 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 

♦ రిజర్వు బ్యాంక్‌ ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో స్పాట్‌ మార్కెట్‌లో 18.66 బిలియన్‌ డాలర్లను విక్రయించింది. 

♦ ఇండియన్‌ క్యాపిట్‌ మార్కెట్‌లోకి పి-నోట్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గుతూనే వస్తున్నాయి. అక్టోబర్‌ చివరి కల్లా 9 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రూ.66,587 కోట్లుగా నమోదయ్యాయి. 

♦ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఎస్‌ఈ షేర్ల బైబ్యాక్‌ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని చూస్తోంది. 

♦ రూపాయి రికవరీ, క్రూడ్‌ ధరల తగ్గుదల నేపథ్యంలో ఎఫ్‌ఫీఐలు ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌లో నవంబర్‌లో ఇప్పటి దాకా రూ.8,285 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేశారు. 

♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలు ప్రస్తుత క్యూ2లో 3.5 రెట్లుకుపైగా పెరిగాయి. రూ.14,716 కోట్లుగా నమోదయ్యాయి. 

♦ సింగపూర్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌, తైవాన్‌ ఇండెక్స్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 20 పాయింట్ల నష్టంతో 3,063 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 6 పాయింట్ల నష్టంతో 9,790 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఇక చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల లాభంతో 2,683 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 2 పాయింట్ల లాభంతో 2,094 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 60 పాయింట్ల లాభంతో 26,243 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 75 పాయింట్ల లాభంతో 21,755 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.49 శాతం లేదా 123 పాయిం‍ట్ల లాభంతో 25,413 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.22 శాతం లేదా 6 పాయింట్ల లాభంతో 2,736 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.15 శాతం లేదా 11 పాయింట్ల నష్టంతో 7,247 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌విడియా షేరు దాదాపు 19 శాతం మేర పతనం కావడం నాస్‌డాక్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 2019 క్యూ3లో కంపెనీ ఆదాయం, గైడెన్స్‌ నిరుత్సాహపరచడం ఇందుకు కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనాతో వాణిజ్య పరమైన డీల్‌ కుదరచ్చని ఆశాభావం వ్యక్తంచేయడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. You may be interested

10,700 పైన నిఫ్టీ

Monday 19th November 2018

గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,682 పాయింట్లతో పోలిస్తే 49 పాయింట్ల లాభంతో 10,731 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,457 పాయింట్లతో పోలిస్తే 190 పాయింట్ల లాభంతో 35,647 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం సోమవారం

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Monday 19th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:53 సమయంలో 49 పాయింట్ల లాభంతో 10,747 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,687 పాయింట్లతో పోలిస్తే 60 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category