STOCKS

News


ఏడాదిలో మరో 25 శాతం ర్యాలీ!

Friday 29th March 2019
Markets_main1553850363.png-24861

అర్వింద్‌ శాంగెర్‌ అంచనా
ఎకానమీలో జోరు కొనసాగితే వచ్చే 12 నెలల్లో దేశీయ మార్కెట్లు 20- 25 శాతం మేర ర్యాలీ జరుపుతాయని జియోస్ఫియర్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతినిధి అర్వింద్‌ శాంగెర్‌ అంచనా వేశారు. యూఎస్‌, యూరప్‌లో మాంద్యం రాకుండా ఉండి, అంతర్జాతీయ కేంద్రబ్యాంకులు లిక్విడిటీ తగ్గకుండా చర్యలు తీసుకొని, అమెరికా, భారత్‌ల్లో జీడీపీ పరుగులు ఆగకుండా ఉంటే దేశీ మార్కెట్లకు ఎదురుండదన్నారు. పశ్చిమ దేశాల్లో పలు ఎకానమీలతో పోలిసే​‍్త భారత్‌, ఇండియాల ఎకానమీలో వృద్ధి చాలా బాగుందన్నారు. అయితే పశ్చిమ దేశాల్లో మాంద్యం వస్తే మాత్రం పరిస్థితి మారిపోతుందన్నారు. బడా ఎకానమీల్లో మందగమనం ఆరంభమైన తర్వాత భారత్‌లో మాంద్యం ఆరంభమయ్యేందుకు సుమారుగా 3- 6 నెలల సమయం ఉంటుందన్నారు. మాంద్యం తప్పకవస్తే మార్కెట్లు తట్టుకోలేవని, గతంలో ఒక్కసారి కూడా మాంద్య పరిస్థితుల్లో భారత మార్కెట్లు మంచి ప్రదర్శన చూపలేదని చెప్పారు. ఎకానమీలో వినిమయం తగ్గుతోందని, దీంతో ఈల్డ్స్‌ తగ్గుతున్నాయని పోర్ట్‌ షెల్టర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సీఈఓ రిచర్డ్‌ హారిస్‌ చెప్పారు. భారత మార్కెట్లు ప్రస్తుత ప్రదర్శనను ఇకముందు కూడా కొనసాగించవచ్చన్నారు. ప్రపంచంలో మాంద్య పరిస్థితులు ఎక్కడ వచ్చినా మార్కెట్లు తట్టుకోవని, కానీ ప్రస్తుతానికి మాంద్యం వచ్చిన సూచనల్లేవని చెప్పారు. కేవలం మందకొడి వృద్ది మాత్రమే కనిపిస్తోందని కానీ ఆర్థికమాంద్యమైతే ఎక్కడా వచ్చినట్లు కనిపించడంలేదని వివరించారు. 



You may be interested

విస్తరిస్తున్న మిరాజ్‌ సినిమాస్‌

Friday 29th March 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మల్టీప్లెక్సుల నిర్వహణలో ఉన్న మిరాజ్‌ సినిమాస్‌ పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం కంపెనీ 110 స్క్రీన్లను నిర్వహిస్తోంది. వచ్చే 15-18 నెలల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్టు మిరాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భువనేష్‌ మెందిరట్ట గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇందులో దక్షిణాదినే కొత్తగా 50 స్క్రీన్లు రానున్నాయని చెప్పారు. నూతన ప్రాజెక్టులకుగాను రూ.200 కోట్లు వెచ్చిస్తున్నట్టు

మల్టీప్లెక్సులు.. బాక్సాఫీస్‌ హిట్‌!

Friday 29th March 2019

మల్టీప్లెక్సులు.. బాక్సాఫీస్‌ హిట్‌! దేశంలో విస్తరిస్తున్న మల్టీప్లెక్స్‌ కల్చర్‌ స్క్రీన్ల ఏర్పాటుకు దిగ్గజ బ్రాండ్ల పోటీ తగ్గుతున్న సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు  హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో మల్టీప్లెక్స్‌ కల్చర్‌ విస్తరిస్తోంది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల స్థానంలో ఇవి ఎంట్రీ ఇస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున మల్టీప్లెక్సుల ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. ఒక్కో కంపెనీ ఏటా 100కుపైగా స్క్రీన్లను నెలకొల్పుతున్నాయంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలు

Most from this category