STOCKS

News


ఇండియన్‌ హోటల్స్‌ టార్గెట్‌ రూ.163

Thursday 22nd November 2018
Markets_main1542883349.png-22313

ముంబై: ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ షేరు ధర గురువారం ఒకదశలో 9 శాతం లాభపడింది. ఇంట్రాడేలో రూ.143 వద్ద గరిష్టస్థాయిని తాకింది. మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.3.45 (2.56 శాతం) లాభపడి రూ.138 వద్ద ముగిసింది. ఈ స్థాయి నుంచి షేరు ధర 20 శాతం మేర పెరిగేందుకు అవకాశం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్ తన అంచనాను వెల్లడించింది. హోటల్‌ పరిశ్రమ ఆక్యుపెన్సీ 67 శాతానికి చేరుకుని తగిన స్థాయిలో ఉందని విశ్లేషించింది. 17,145 గదులతో ఈరంగంలో దేశంలోనే రెండవ అతిపెద్ద సంస్థగా ఉన్నటువంటి ఇండియన్‌ హోటల్స్‌కు పెరగనున్న ఆక్యుపెన్సీ ప్రయోజనం చేకూర్చనుందని భావిస్తోంది. 2018-20 ఆర్థిక సంవత్సరాలలో ఆదాయం 9 శాతం, ఎబిడిటా 25 శాతం చొప్పున చక్రగతి వృద్ధిరేటును సాధించవచ్చని అంచనావేసింది. 



You may be interested

35వేల దిగువకు సెన్సెక్స్‌

Thursday 22nd November 2018

10550 దిగువకు నిఫ్టీ మార్కెట్‌కు మూడోరోజూ తప్పని నష్టాలు ముంబై:- మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ మూడోరోజూ నష్టాలతో ముగిసింది. మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవు దినాలు(శుక్రవారం గురునానక్‌ జయంతి, శని ఆదివారాలు సాధారణ సెలవు దినాలు), వచ్చేవారం ఎఫ్‌అండ్‌ఓ ముగింపు వారం కావడంతో కావడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా అమ్మకాలకే మొగ్గుచూపారు. గత రెండు ట్రేడింగ్‌ సెషన్‌లో లార్జ్‌ క్యాప్‌ షేర్లు ఎక్కువగా నష్టపోగా నేటి ట్రేడింగ్‌ మిడ్‌క్యాప్‌

మిడ్‌క్యాప్స్‌లో 10 ఆణిముత్యాలు..

Thursday 22nd November 2018

ఆగస్టులో నమోదైన గరిష్టస్థాయి నుంచి సెన్సెక్స్‌ 9 శాతం పడిపోయింది. ఇదే సమయంలో.. అధిక విలువల కలిగిన, ద్రవ్య లభ్యత సమస్యను ఎదుర్కొంటున్నటువంటి, ముడివస్తువుల పెరుగుదలను తట్టుకోలేదని అనేక మిడ్‌క్యాప్‌ షేర్లు 10-40 శాతం వరకు పతనమయ్యాయి. అయితే, వీటిలోనే పలు కంపెనీలు మాత్రం రానున్న రోజుల్లో మంచి రాబడిని అందించే అవకాశం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్ సూచిస్తోంది. 52-వారాల గరిష్టస్థాయి నుంచి 40 శాతం వరకు పడిపోయిన జాబితాలో

Most from this category