STOCKS

News


ఎన్నికల తర్వాత ఐపీఓల జోరు

Wednesday 3rd April 2019
Markets_main1554276086.png-24949

ఫలితాల కోసం చూస్తున్న ఇన్వెస్టర్లు, కంపెనీలు
-సుస్థిర ప్రభుత్వం వస్తే ఐపీఓల వెల్లువ
-ఇప్పటికే 70 కంపెనీల క్యూ
-ఈవై తాజా నివేదిక 
-గత ఆర్థిక సంవత్సరంలో తగ్గిన ఐపీఓల జోరు

న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)ల జోరు మరింతగా ఉంటుందని ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్‌(ఈవై) తాజా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో 14 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.6,482 కోట్లు(94 కోట్ల డాలర్లు) సమీకరించాయని తెలిపింది.  ఐపీఓల సంఖ్య విషయంలో ఈ మూడు నెలల కాలంలో ప్రపంచంలోనే భారత్‌ నాలుగో స్థానంలో నిలిచిందని వివరించింది. ఈవై ఇండియా ఐపీఓ ట్రెండ్స్‌ రిపోర్ట్‌: క్యూ1 2019 పేరుతో వెలువడిన ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే...
నివేదికలోని అంశాలు 
-లోక్‌సభ ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడగలదన్న భావన క్యాపిటల్‌ మార్కెట్లో నెలకొన్నది. 
- ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌లో ఐదు ప్రధాన ఐపీఓలు రాగా, ఎస్‌ఎమ్‌ఈ మార్కెట్లో 9 ఐపీఓలు వచ్చాయి. 
-ఇన్వెస్టర్లు, కంపెనీలు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఫలితాలు వెలువడే వరకూ ఐపీఓలు అరకొరగానే ఉంటాయి. 
-ఎన్నికల అనంతరం సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే ఐపీఓలు వెల్లువలా వస్తాయి. 
-ఐపీఓకు రావడానికి ఇప్పటికే 70 కంపెనీలు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి అనుమతి పొందాయి. ఈ కంపెనీలన్నీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి. 
-ఐపీఓకు అనుమతివ్వాలంటూ 19 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేశాయి. 
-కంపెనీల ఆర్థిక ఫలితాలు, నిధుల లభ్యతను మెరుగుపరచడానికి ఆర్‌బీఐ తీసుకునే చర్యలు, ఎన్నికల సంబంధిత ప్రభుత్వ వ్యయం పెరగడం- ఈ మూడు అంశాలు సమీప భవిష్యత్తులో స్టాక్‌ మార్కెట్‌పై, ఐపీఓల కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయి. 

తగ్గిన ఐపీఓ నిధుల సమీకరణ..
గత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ చాలా తక్కువ స్థాయిలో ఉందని ప్రైమ్‌ డేటాబేస్‌ గ్రూప్‌ వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ రూ.83,767 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది 81 శాతం క్షీణించి రూ.16,294 కోట్లకే పరిమితమైందని పేర్కొంది. మార్కెట్లో కరెక్షన్‌ చోటు చేసుకోవడంతో పలు కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం వచ్చిన పది పెద్ద ఐపీఓల్లో 7 కంపెనీలు సానుకూల రాబడులనిచ్చాయి. ఫైన్‌ ఆర్గానిక్‌  షేర్‌ 69 శాతం లాభపడగా, లెమన్‌ ట్రీ 52 శాతం, ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ 41 శాతం చొప్పున పెరిగాయి. టీసీఎన్‌ఎస్‌ క్లోథింగ్‌, క్రెడిట్‌ యాక్సిస్‌ గ్రామీణ్‌  షేర్లు 27-15 శాతం రేంజ్‌లో పెరిగాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన అన్ని ఐపీఓలూ లాభాల పంట పడించలేదు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ దాదాపు సగం పడిపోయింది. వారోక్‌ ఇంజినీరింగ్‌ 39 శాతం, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌లు  29  శాతం చొప్పున పతనమయ్యాయి. 
టేబుల్‌ 1 
ఐపీఓ మెరుపులు, మరకలు 
కంపెనీ                ఇష్యూ ధర    ప్రస్తుత ధర    వృద్ధి/క్షీణత(శాతంలో)
ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌    783        1,320    69
లెమన్‌ ట్రీ హోటల్స్‌    56        85        52
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ    1,100    1,564    42
ఆవాస్‌ ఫైనాన్స్‌        821        1,161    41
రీట్స్‌                185        255        38
క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌    422        537        27
ఛాలెట్‌ హోటల్స్‌        280        336        20
టీసీఎన్‌ఎస్‌ క్లోథింగ్‌    716        823        15


ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌    520        234        -55
వారోక్‌ ఇంజినీరింగ్‌    967        591        -39
ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌    572    405        -29
ఇర్కన్‌ ఇంటర్నేషనల్‌        475    405        -15

అలాంటి కంపెనీలకు దూరంగా ఉండండి
గత ఆర్థిక సంవత్సరం చివర్లో కరెక్షన్‌ల కారణంగా ఐపీఓ మార్కెట్లో స్తబ్దత నెలకొన్నది. అయితే సెన్సెక్స్‌ కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డ్‌లను సృష్టిస్తుండటంతో ఐపీఓ మార్కెట్‌ జోరుగా ఉండనున్నది. అయితే ఐపీఓల్లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధి అవకాశాల్లేని కంపెనీల ఐపీఓలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని వ్యాపారాలు వృద్ధిలేని వెంచర్లుగా మిగిలిపోతాయని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా పేర్కొన్నారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, బీఎస్‌ఈ ఇండియా వంటి షేర్లు సంపద సృష్టిలో విఫలమయ్యాయని తెలిపారు. వృద్ధి సాధించే వ్యాపారాన్ని నిర్వహించే కంపెనీలు తమ ఐపీఓకు అధిక ధరలను నిర్ణయించినా, అలాంటి ఐపీఓలకు దూరంగా ఉండటమే మేలని సూచించారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో రానున్న కొన్ని ముఖ్యమైన ఐపీఓలు
లోధా డెవలపర్స్‌
పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌
ఫ్లెమింగో ట్రావెల్‌ రిటైల్స్‌
జీఆర్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ 
భారత్‌ హోటల్స్‌ 
పతంజలి ఆయుర్వేద 
ఐఆర్‌సీటీసీ
గోఎయిర్‌
భారత్‌ సీరమ్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌
జీఎమ్‌ఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌
నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)
కిమ్స్‌ హాస్పిటల్స్‌
కళ్యాణ్‌ జ్యూయలర్స్‌
యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ 
హిందుజా లేలాండ్‌ ఫైనాన్స్‌
దొడ్ల డెయిరీ
ఇమామి సిమెంట్‌ 
జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్‌
శ్రీరామ్‌ ప్రొపర్టీస్‌ 



You may be interested

ఐపీఓకు అన్నై ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ !

Wednesday 3rd April 2019

ఇష్యూ సైజు రూ.200-225 కోట్లు !  న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెం‍ట్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) కంపెనీ అన్నై ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తోంది. తమిళనాడుకు చెందిన ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి ఇటీవలనే సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల కోటి ఈక్విటీ షేర్లను జారీచేస్తారు. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన 16 లక్షల ఈక్విటీ షేర్లను కూడా జారీ చేయాలని

భారత్‌పై డబ్ల్యూటీవోకి ఈయూ ఫిర్యాదు

Wednesday 3rd April 2019

- ఐసీటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాల వివాదం న్యూఢిల్లీ/బ్రసెల్స్:  మొబైల్ ఫోన్స్ సహా ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)కి సంబంధించిన కొన్ని ఉత్పత్తులపై భారత్‌ దిగుమతి సుంకాలను విధిస్తుండటాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) సవాల్ చేసింది. ఇలా సుంకాల విధింపు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. మొబైల్ ఫోన్లు, విడిభాగాలు, బేస్ స్టేషన్స్‌, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ మొదలైన ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను

Most from this category