STOCKS

News


భారీ ప్రీమియంతో భారత్‌ మార్కెట్లు

Friday 28th December 2018
Markets_main1545992779.png-23291

వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత ఈక్విటీ మార్కెట్లు భారీ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. వచ్చే ఏడాది కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ బాగా పెరుగుతాయన్న అంచనాలు దేశీయ సూచీలను పరుగులు తీయించాయి. ప్రస్తుతం ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌తో పోలిస్తే నిఫ్టీ సుమారు 100 శాతం ప్రీమియంతో ఉంది. నిఫ్టీ ట్రయిలింగ్‌ 12 నెలల పీఈ 22 వద్ద ఉండగా, ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ పీఈ 11.45 వద్ద ఉంది. 2000 సంవత్సరం తర్వాత ఇరు సూచీల మధ్య ఇంత అంతరం రావడం తొలిసారి. అయితే ప్రీమియంలు ఇంత భారీగా ఉన్నా దేశీయ మార్కెట్లు ఈ సంవత్సరం అనుకోదగ్గంత రాబడులనేమీ అందించలేదు. కానీ ఇతర వర్ధమాన దేశాల మార్కెట్లు ఈ మాత్రం కూడా రాబడులు ఇవ్వక పోవడంతో ఇప్పటికీ ఇండియా మార్కెట్టే అధిక ప్రీమియం వద్ద ఉంది. 


2001, 2002లో తప్ప భారత మార్కెట్లు ఎప్పుడూ ఇతర వర్ధమాన మార్కెట్ల కన్నా మంచి ప్రదర్శనే చూపుతూ వస్తున్నాయి. 2019-20లో కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌లో 20 శాతం వృద్ది ఉంటందన్న అంచనాలు, వచ్చే ఐదేళ్లలో భారత మార్కెట్‌ క్యాప్‌ 5 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందన్న అభిప్రాయాలతో ఇతర వర్దమాన మార్కెట్ల కన్నా భారత మార్కెట్లపైనే ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్నారని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడున్నంత ప్రీమియం మంచిది కాదని, త్వరలో కరెక‌్షన్‌ తప్పదని అంచనా వేస్తున్నారు. క్రూడ్‌ ధర, ట్రేడ్‌వార్‌, యూరప్‌ వృద్ధి మందగమనం తదితర అంశాలు వచ్చే ఆరునెలల్లో మార్కెట్‌ను నెగిటివ్‌గా ప్రభావితం చేయవచ్చని తెలిపారు. 



You may be interested

మూడో రోజూ లాభాల ముగింపే

Friday 28th December 2018

10850పైన నిఫ్టీ ముగింపు 36000పైన ముగిసిన సెన్సెక్స్‌ ఫార్మా, ఫైనాన్స్‌ షేర్లు ర్యాలీతో సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల అంశాలతో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం స్థిరమైన ర్యాలీని చేశాయి. అయితే చివరి గంటలో అమ్మకాలు జరగడంతో సూచీల లాభాలు కొంతమేర తగ్గాయి. ప్రపంచమార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ ప్రోత్సాహంతో సూచీలు జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ను లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 105 పాయింట్ల లాభంలో 35,912 వద్ద, నిఫ్టీ 59

జనవరి సీరిస్‌లో పెరిగిన రోలోవర్లు

Friday 28th December 2018

డిసెంబర్‌ సీరిస్‌తో పోలిస్తే జనవరి సీరిస్‌లోకి నిఫ్టీ రోలోవర్లు పెరిగాయి. డిసెంబర్‌తో పోలిస్తే రోలోవర్లు దాదాపు 13.66 శాతం పెరిగి జనవరిలో 74.27 శాతానికి చేరాయి. నిఫ్టీ గత మూడునెలల సరాసరి రోలోవర్లు 69.85 శాతమున్నాయి. మార్కెట్‌ పరిస్థితిని బట్టి చూస్తే ఎక్కువగా షార్ట్స్‌ రోలోవర్ జరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పలువురు ఇన్వెస్టర్లు ఆచితూచి పొజిషన్లు తీసుకుంటున్నారు. ఎఫ్‌ఐఐలు డిసెంబర్‌లో మిశ్రమ పొజిషన్లు తీసుకొని చివర్లో ఎగ్జిట్‌

Most from this category