STOCKS

News


ఎఫ్‌ఐఐలను ఆకర్షించేంత సీన్‌ లేదు!

Tuesday 25th September 2018
Markets_main1537858362.png-20555

భారత్‌ మార్కెట్‌పై బోఫా ఎంఎల్‌ అంచనా
భారత ఈక్విటీల వాల్యూషన్లు విదేశీ మదుపరులను ఆకర్షించే స్థాయిలో లేవని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ అభిప్రాయపడింది. దేశీయ ఈక్విటీలు ఉండాల్సినదానికన్నా ఎక్కువ స్థాయిలకు పెరిగాయని తెలిపింది. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే చాలా అధిక స్థాయిల వద్ద ఉన్నాయని తెలిపింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత ఈక్విటీల్లో రిస్కులు పెరుగుతాయని అంచనా వేసింది. తాజా కరెక‌్షన్‌ ఆరంభమేనని, సూచీల్లో మరింత పతనం ఉండొచ్చని పేర్కొంది. అయితే రూపాయి పతనంపై మాత్రం బోఫా పెద్ద ఆందోళన వ్యక్తం చేయలేదు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం అర్జెంటుగా రంగంలోకి దిగి ఆదుకోవాల్సిన పరిస్థితి ఏమీ లేదని సంస్థ భారత వ్యూహకర్త సంజయ్‌ మూకిం చెప్పారు. వర్ధమాన దేశాల కరెన్సీలకు అనుబంధంగా రూపీ కదలికలున్నాయని, రూపాయిని ఇలాగే వదిలేయాలని అన్నారు. ఈక్విటీల్లో వాల్యూషన్లు పెరిగిపోతుంటే పోర్టుఫోలియోను రిస్కురహితంగా మార్చుకోవాలని చెప్పారు. ఇన్వెస్టర్లు లిక్విడిటీ రిస్కుల జోలికి పోకుండా ఉండాలన్నారు. గతంలో చేసినట్లు చిన్న మధ్యతరహా స్టాకుల వేట మానుకోవాలని సూచించారు. నాణ్యమైన పెద్ద కంపెనీల షేర్లలో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలని సలహా ఇచ్చారు. 



You may be interested

ఎం&ఎం ఫైనాన్స్‌ 7శాతం అప్‌..!

Tuesday 25th September 2018

ముంబై:- లిక్విడిటీ కొరత కారణంగా కొన్ని హౌసింగ్స్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం&ఎం)ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ షేరు మాత్రం లాభాల బాట పట్టింది. నేడు బీఎస్‌ఈలో ఎం&ఎం ఫైనాన్స్‌ షేరు రూ.391.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రేటింగ్‌ సంస్థలు ఎం&ఎం ఫైనాన్స్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో షేరుకు కొనుగోళ్ల మద్దతు పెరిగింది. ఫలితంగా ఇంట్రాడేలో షేరు 7.50శాతం ర్యాలీ చేసి రూ.420.20 గరిష్టానికి

క్రూడ్‌ బుల్లిష్‌

Tuesday 25th September 2018

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో తగ్గిన సరఫరాను ఒపెక్‌ దేశాలు పూర్తి చేయవనే అంచనాలు ఇందుకు ప్రధాన కారణం. అలాగే ఆర్థిక, రాజకీయ అస్థిరత పరిస్థితుల వల్ల వెనెజులలో క్రూడ్‌ ఉత్పత్తి తగ్గడం మరో నెగటివ్‌ అంశం. మిలిటెంట్‌ యాక్టివిటీ వల్ల లిబియా, నైజీరియాల్లో ఆయిల్‌ ఉత్పత్తి ఒకేరకంగా ఉండదు. ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే అమెరికా క్రూడ్‌ ఆయిల్‌ ఇన్వెంటరీలు తగ్గుతూ వస్తున్నాయి. రూపాయిపై

Most from this category