STOCKS

News


రానున్న దశాబ్దంలో ఎన్నో అవకాశాలు: దమానీ

Wednesday 6th February 2019
Markets_main1549477213.png-24056

భారత మార్కెట్ల విషయంలో ప్రముఖ ఇన్వెస్టర్‌ రమేష్‌ దమానీ బుల్లిష్‌ ధోరణి వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనన్ని పెట్టుబడుల అవకాశాలను భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే పదేళ్ల కాలంలో కల్పిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 25-30 ఏళ్ల కాలంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఎన్నో రెట్లు పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. దమాని 1989లో స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు సెన్సెక్స్‌ 800గా ఉంటే, అదిప్పుడు 36,000 మార్క్‌పైన ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.  

 

‘‘కార్గిల్‌ యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, 2016లో డీమోనిటైజేషన్‌ వంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరాయి. కనుక కేవలం స్థూల ఆర్థిక అంశాలనే పట్టుకొని వేలాడడం తప్పుడు ఆలోచన. విశ్వసనీయమైన వ్యక్తులు నడిపించే గొప్ప వ్యాపారాన్ని గుర్తించేందుకు ప్రయత్నం చేయాలి. దీన్ని మీరు అర్థం చేసుకోగలిగిన ధరలో కొనుగోలు చేయాలి’’ అని రమేష్‌ దమానీ సూచించారు. రానున్న సంవత్సరాల్లో ప్రపంచ మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటుందని అంచనా వేశారు. 

 

ఈ రంగాలకు సానుకూలం
వినియోగ రంగం పెట్టుబడులకు స్మార్ట్‌గా కనిపిస్తోందన్నారు. టెక్నాలజీ, యాప్‌ ఆధారిత వ్యాపారాలు రానున్న సంవత్సరాల్లో మంచిగా రాణించొచ్చని పేర్కొన్నారు. ‘‘మీడియా విభాగంలో ఆసక్తికరమైన ధోరణులు కనిపిస్తున్నాయి. క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్‌ వినూత్నమైన విభాగాలు. రానున్న పదేళ్ల కోసం పెట్టుబడికి ఎయిర్‌లైన్స్‌ మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ అవుతుంది’’ అని దమానీ తెలిపారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ప్రస్తుత స్థాయిలో ఆకర్షణీయంగా లేవన్నారు. కొంత కాలం పాటు ఇవి ప్రతికూల పనితీరు చూపించొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వాటి పట్ల తాను బేరిష్‌గా లేనని స్పష్టం చేశారు. స్మార్ట్‌గా స్టాక్స్‌ను ఎంచుకునే వారికి మంచి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని సూచించారు. ప్రస్తుతం తాను చాలా తక్కువ నగదు నిల్వలతో ఉన్నట్టు దమానీ తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో సంక్షోభం ఇంకా సమసిపోలేదన్నారు. లిక్విడిటీ పరిస్థితి చాలా కఠినంగా ఉందన్నారు. మధ్యంతర బడ్జెట్‌ ప్రభావం కొన్ని రోజులే ఉంటుందన్నారు. ఈ తరహా సంఘటనలకే పరిమితం కారాదని సూచించారు. అమెరికాలో రానున్న సంవత్సరాల్లో వడ్డీ రేట్లు పెరుగుతాయని, ఇదే జరిగితే వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని అంచనా వేశారు. దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గుతాయని తాను భావించడం లేదని తెలిపారు.You may be interested

 ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Thursday 7th February 2019

క్రితం రోజు భారత్‌ సూచీలు పెద్ద ర్యాలీ జరిపిన నేపథ్యంలో గురువారం ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 15 పాయింట్లుతగ్గింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 11,075 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,090 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం గత రాత్రి అమెరికా , యూరప్‌ సూచీలు స్వల్ప తగ్గుదలతో ముగిసాయి. తాజాగా జపాన్‌ సూచీ అరశాతం

ఈ ఏడాది బంగారం, వెండిలో ర్యాలీ: కార్వీ

Wednesday 6th February 2019

ఈ ఏడాది బంగారం, వెండి ర్యాలీ చేస్తాయని కార్వీ గ్రూపులో భాగమైన కార్వీ కన్సల్టెంట్స్‌ అంచనా వేసింది. ఇన్వె‍స్టర్లు తమ పెట్టుబడి నిర్ణయాలపై అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ తన 11వ వార్షిక కమోడిటీ అండ్‌ కరెన్సీ రిపోర్ట్‌ 2019ను విడుదల చేసింది. 2017లో బేస్‌ మెటల్స్‌ మంచి ర్యాలీ చేయగా, 2018లో మాత్రం ఈ ట్రెండ్‌ కొనసాగని విషయం తెలిసిందే. దేశీయ రూపాయి విలువ క్షీణించడం మరింత సమస్యాత్మకంగా

Most from this category