News


మిడ్‌క్యాప్‌ ర్యాలీకి రంగం సిద్ధం!?

Saturday 16th March 2019
Markets_main1552675741.png-24632

వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం ఆరంభమైంది. కరెంటు ఖాతా లోటు డిసెంబర్‌ త్రైమాసికానికి ఐదేళ్ల గరిష్ట స్థాయి నుంచి సులభతరం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే ఈ రెండు పరిణామాలు చోటు చేసుకున్న సమయం అనుకూలమని, లార్జ్‌క్యాప్‌ కంటే ఇతర షేర్లు మంచి ప్రదర్శన చూపిస్తాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇటీవలి ఆర్‌బీఐ రేట్ల కోతతో ఇది ఇప్పటికే ఆరంభమైందంటున్నారు. నిఫ్టీ 500 ఇండెక్స్‌ ఫిబ్రవరి 7 నుంచి 4 శాతం పెరిగింది. ఇదే కాలంలో నిఫ్టీ 2 శాతం పెరిగింది.  

 

ఆర్‌బీఐ ఏప్రిల్‌ పాలసీ సమీక్ష నుంచి మరిన్ని రేట్ల కోత ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వృద్ధి నిదానించడం, ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే ఉండడం రేట్ల కోతకు అనుకూలించే అంశాలుగా పేర్కొంటున్నారు. ‘‘స్థిరమైన స్థూల ఆర్థిక వాతావరణం, స్థిరమైన కరెన్సీతో వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ర్యాలీతో నిఫ్టీ-50తో పోలిస్తే నిఫ్టీ 500 మంచి పనితీరు చూపిస్తోంది’’ అని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తన నివేదికలో పేర్కొంది. 2013 సెప్టెంబర్‌ నుంచి 2017 డిసెంబర్‌ మధ్య కరెంటు ఖాతా లోటు జీడీపీలో 4.16 శాతం నుంచి 1.35 శాతానికి క్షీణించింది. వడ్డీ రేట్లు 9.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గాయి. 2010 జనవరి నుంచి 2013 ఆగస్ట్‌ మధ్య కరెంటు ఖాతా లోటు, వడ్డీ రేట్లు స్థిరంగా పెరిగిన విషయం గమనార్హం. 

 

చమురు ధరలు స్థిరపడితే క్యాడ్‌ తగ్గేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘చమురు ధరలు తక్కువలో స్థిరంగా ఉంటే అది కరెంటు ఖాతా లోటు నియంత్రణకు తోడ్పడుతుంది. చారిత్రక ఆధారాల ప్రకారం చూస్తే మరో విడత మిడ్‌క్యాప్స్‌ ప్రదర్శన దిశగా ఉన్నాం’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. డిసెంబర్‌ త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు జీడీపీలో 2.3 శాతానికి (15.1 బిలియన్‌ డాలర్లు) పరిమితం అవుతుందని నిర్మల్‌బంగ్‌ సెక్యూరిటీస్‌ అంచనా. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఇది 2.9 శాతంగా ఉంది. ‘‘ఆర్‌బీఐ ఎంపీసీ ఏప్రిల్‌ 4 నాటి సమీక్షలో 25 బేసిస్‌ పాయింట్ల మేర రేట్లను తగిస్తుందని అంచనా వేస్తున్నాం. అలాగే, జూన్‌-ఆగస్ట్‌లోనూమళ్లీ రేట్ల కోత ఉంటుంది. ద్రవ్యోల్బణం సగటున 2019-20లో 4.7 శాతంగా ఉండొచ్చు. ఆర్‌బీఐ 2-6 శాతం లక్ష్యిత పరిధిలోనే ఉంటుంది’’ అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ పేర్కొంది. 
 



You may be interested

ఫిబ్రవరిలో తగ్గిన వాణిజ్యలోటు

Saturday 16th March 2019

- ఎగుమతుల విలువ  26.67 బిలియన్‌ డాలర్లు - దిగుమతుల విషయంలో ఈ మొత్తం 36.26 బిలియన్‌ డాలర్లు - వెరసి వాణిజ్యలోటు  9.6 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు ఫిబ్రవరిలో ఉపశమించింది. దిగుమతులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... - ఎగుమతుల విలువ 2.44 శాతం పెరుగుదలతో 26.67 బిలియన్‌ డాలర్లు.  ఫార్మా, ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌  ఎగుమతులు పెరిగాయి.  - దిగుమతుల విషయంలో ఈ

వారమంతా లాభాలే

Friday 15th March 2019

38000పైన ముగిసిన సెన్సెక్స్‌ 11400 పైన ముగిసిన నిఫ్టీ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం కూడా లాభాలతో ముగిసింది. దీంతో సూచీలు ఈ వారమంతా లాభాల బాటలోనే సాగినట్లైంది. సెన్సెక్స్‌ 269 పాయింట్ల లాభంతో 38,024 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 11,427 వద్ద స్థిరపడ్డాయి. ఈ వారం మొత్తంలో సెన్సెక్స్‌ సూచీ 1352 పాయింట్లను, నిఫ్టీ 391 పాయింట్లను ఆర్జించాయి. విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు

Most from this category