STOCKS

News


ఇండియన్‌ ఎకానమీ టేకాఫ్‌కు రెడీ: ఝున్‌ఝున్‌వాలా

Friday 14th December 2018
Markets_main1544772085.png-22931

దిగ్గజ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తాజాగా మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోని వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికలను 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించడం లేదన్నారు. అయితే అధికారంలోకి ఎవ్వరొచ్చిన ప్రమాదమేమీ లేదని, భారత్‌ గొప్ప ప్రజాస్వామ్య దేశమని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మిడ్‌ క్యాప్స్‌ బాగా కరెక‌్షన్‌కు గురయ్యాయని పేర్కొన్నారు. లార్జ్‌ క్యాప్‌ కంపెనీల మాదిరి క్యాష్‌ఫ్లో, నాణ్యమైన వ్యాపారాలు, వ్యాల్యుయేషన్స్‌ వంటివి మిడ్‌ క్యాప్‌ కంపెనీలకు ఉండవని తెలిపారు. ఇండియన్‌ మార్కెట్‌లోనే కాకుండా ప్రస్తుత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఒడిదుడకులు ఉన్నాయని పేర్కొన్నారు. సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లలో ఒడిదుడుకులు ఉంటాయని భావించడం లేదన్నారు. బ్యాంకుల ఎన్‌పీఏలు ఇక పెరగకపోవచ్చని తెలిపారు. స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

చాలానే సానుకూలతలు 
మార్కెట్లు ఎన్నికల ఫలితాలను మరిచిపోయాయని ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. మళ్లీ ఫిబ్రవరి-మార్చిలో మార్కెట్లలో ఎన్నికల హడవిడి ఉంటుందని పేర్కొన్నారు. వినియోగ డిమాండ్‌ బాగుందని, మూలధన పెట్టుబడులు పుంజుకుంటున్నాయని, ఎన్‌పీఏల్లో పెరుగుదల ఉండకపోవచ్చని తెలిపారు. ఇండియన్‌ ఎకానమీ టేకాఫ్‌కు రెడీగా ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో ఉండటం, క్రూడ్‌ ధరల పతనం వంటివి సానుకూల అంశాలని తెలిపారు. జీఎస్‌టీ వల్ల జీడీపీలో 1.5 శాతం అధిక వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొన్నారు. ఎకానమీ అప్‌ట్రెండ్‌లో ఉందన్నారు. అలాగే మార్కెట్‌లో దేశీ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగొచ్చని అంచనా వేశారు. ఈ రెండు అంశాలను మార్కెట్లు కూడా గమనించాయని తెలిపారు. 
 
సిప్‌లపై..
ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలతో పోలిస్తే సిప్‌లకు ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా చక్రగతిన చూస్తే 12 నుంచి 15 శాతం దాకా రిటర్న్స్‌ పొందొచ్చని పేర్కొన్నారు. సిప్‌ పెట్టుబడుల్లో ఒడిదుడుకులు ఉంటాయని భావించడం లేదన్నారు. సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతూనే ఉంటాయని తెలిపారు. మార్కెట్‌లో ఎక్కువ సార్లు బుల్‌గా ఉంటూనే డబ్బు సంపాదించానని పేర్కొన్నారు. అయితే 1992 షార్ట్‌ సెల్లింగ్‌ ద్వారా భారీ రాబడి అందుకున్నానని తెలిపారు. 

లిక్విడిటీ సమస్య కొంత కాలమే
లిక్విడిటీ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఝున్‌ఝున్‌వాలా. ఈ సమస్య కొంత కాలం మాత్రమే ఉంటుందని, ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులకు వచ్చిన ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు. భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు కలిగిన దేశమని, అందువల్ల మనకు విదేశీ మూలధనం కావాల్సి ఉందని తెలిపారు. మొండి బకాయిల గుర్తింపు చివరి దశలకు చేరుకుందని పేర్కొన్నారు. ఎన్‌సీఎల్‌టీ, ఐబీసీ విషయానికి వస్తే.. వాటి పని అవి చేసుకొని వెళ్తున్నాయని తెలిపారు. వేలం వేస్తే ధర వస్తుందన్నారు. అయితే ఇక్కడ బ్యాంకులతో ఏకీభవిస్తున్నానని తెలిపారు. 25 పవర్‌ ప్లాంట్లను కలిగి ఒకేమొత్తంగా వేలం వేయడం సరికాదని పేర్కొన్నారు. అలోక్‌ ఇండస్ట్రీస్‌ సమస్య తీరితే.. అన్ని సమస్యలు పరిష్కారమౌతాయని తెలిపారు. 

ఫార్మాపై పాజిటివ్‌
ఫార్మాపై పాజిటివ్‌గా ఉన్నానని ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. అయితే అన్ని కంపెనీల మీద కాదని పేర్కొన్నారు. బ్యాంకులకు కూడా ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. ఇండియన్‌ మార్కెట్‌ వార్షికంగా 12 నుంచి 15 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందన్నారు. ఇది అధిక ఆర్‌వోఈ కలిగిన మార్కెట్‌ అని పేర్కొన్నారు. కార్ల అమ్మకాలు మందగించాయన్నారు. ఆర్థిక సమస్యల వల్ల ట్రక్‌ అమ్మకాలు కూడా పడిపోయాయని తెలిపారు. కన్సూమరల్‌ ప్రొడక్టులు మంచి పనితీరు కనబర్చాయని పేర్కొన్నారు. మార్కెట్లు ప్రస్తుతం చౌకగా లేవన్నారు. మార్కెట్‌ నుంచి 12-18 శాతానికి పైనా రాబడులను ఆశించొద్దని తెలిపారు. సిప్‌లో 8 నుంచి 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేస్తే ఈ మేర రాబడులను అంచనా వేయవచ్చని పేర్కొన్నారు. దీర్ఘకాలం లక్ష్యంతో మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని సూచించారు.You may be interested

ఐఓసీ షేర్లకు బైబ్యాక్‌ బూస్టింగ్‌

Friday 14th December 2018

ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 4శాతం లాభపడ్డాయి. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో రూ.4,435 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌తో పాటు, రూ.6,665 కోట్ల మధ్యంతర డివిడెంట్‌ చెల్లింపునకు అనుమతులు లభించడం షేర్ల ర్యాలీకి కారణమైంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐఓసీ షేర్లు రూ.141.15ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 4శాతం లాభపడి రూ.142.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని

రాఫెల్‌ డీల్‌ పిటిషన్ల కొట్టివేత: అడాగ్‌ షేర్ల ర్యాలీ

Friday 14th December 2018

వివాదస్పద రాఫెల్ ఒప్పందంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో శుక్రవారం అనిల్‌ అంబానీ గ్రూప్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. దేశ రక్షణార్థం 2015 ఏప్రిల్‌  ఫ్రాన్స్‌ సంస్థ రాఫెల్‌ నుంచి నుంచి 36 యుద్ధ విమానాలను రూ.58వేల కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోది ప్రకటించారు. అందులో భాగంగా రాఫెల్‌ తమ భారత భాగస్వామిగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను ఎంచుకుంది. దివాలా తీసిన

Most from this category