STOCKS

News


ఇండియన్‌ కంపెనీల ఏడీఆర్‌లు అక్కడక్కడే..

Saturday 17th November 2018
Markets_main1542428774.png-22112

  • నిలకడగా ఇన్ఫోసిస్‌, వేదాంత ఏడీఆర్‌లు
  • 1 శాతానికి పైగా పెరిగిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏడీఆర్‌ 

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, వేదాంత ఏడీఆర్‌లు నిలకడగా ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో ఏడీఆర్‌లు స్వల్పంగా తగ్గాయి. 
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.08 శాతం తగ్గుదలతో 12.56 డాలర్లకు క్షీణించింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ నిలకడగా 9.33 డాలర్లుగానే ఉంది. విప్రో ఏడీఆర్‌ 0.38 శాతం క్షీణతతో 5.26 డాలర్లకు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.23 శాతం వృద్ధితో 95.34 డాలర్లకి పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.59 శాతం క్షీణతతో 10.16 డాలర్లకి తగ్గింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 1.25 శాతం వృద్ధితో 34.92 డాలర్లకి పెరిగింది. ఇక వేదాంత ఏడీఆర్‌ నిలకడగా 11.56 డాలర్లుగానే ఉంది. 



You may be interested

గెయిల్‌ చేతికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ పవన విద్యుత్తు వ్యాపారం?

Saturday 17th November 2018

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు చెందిన పవన విద్యుదుత్పత్తి విభాగాన్ని కొనుగోలు చేయాలని గెయిల్‌ ఇండియా యోచిస్తోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఐఎఫ్‌ఎల్‌ఎల్‌) గ్రూప్‌ కంపెనీలు రుణాల చెల్లింపుల్లో డీఫాల్ట్‌ అయి, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో కుదుపులకు కారణమైన విషయం తెలిసిందే. ఈ ​గ్రూప్‌లో భాగమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌కు చెందిన 775 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి వ్యాపారాన్ని కొనుగోలు చేయాలని గెయిల్‌ భావిస్తోంది. ఈ విషయమై గెయిల్‌ కంపెనీ

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..

Saturday 17th November 2018

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా క్లోజయ్యాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 29 పాయింట్ల లాభంతో 3,083 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో 9,797 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 11 పాయింట్ల లాభంతో 2,679 పాయింట్ల వద్ద ముగిసింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల లాభంతో 2,092 పాయింట్ల

Most from this category