News


1.80% నష్టపోయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌

Saturday 24th November 2018
Markets_main1543048144.png-22368

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఏడీఆర్‌లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ మినహాయించి మిగిలిన అన్ని కంపెనీల ఏడీఆర్‌లు 0.78 శాతం నుంచి 1.95 శాతం వరకు నష్టాలను నమోదుచేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.18 డాలర్లు (1.80 శాతం) తగ్గి 9.83 డాలర్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9.92 డాలర్ల గరిష్ట, 9.79 డాలర్ల కనిష్టస్థాయిలను తాకింది. ఈ కౌంటర్‌లో 4.26 మిలియన్‌ వాల్యూమ్స్‌ నమోదయ్యాయి. వాల్యూమ్స్‌ పరంగా రెండవ స్థానంలో ఉన్నటువంటి ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ స్వల్పంగా లాభపడింది. 0.02 డాలర్లు (0.22 శాతం) లాభపడి 9.09 డాలర్ల వద్ద ముగిసింది. ఈ కౌంటర్‌లో 3.16 మిలియన్‌ వాల్యూమ్స్‌ నమోదయ్యాయి. విప్రో ఏడీఆర్‌ 0.04 డాలర్లు (0.78శాతం) నష్టపోయి 5.08 డాలర్ల వద్ద క్లోజైంది. వేదాంతా ఏడీఆర్‌ 0.22 డాలర్లు (1.95 శాతం) నష్టపోయి 11.07 వద్ద నిలిచింది. టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.13 డాలర్లు (1 శాతం) నష్టపోయి 12.89 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.08 డాలర్లు (0.08శాతం) లాభపడి 96.34 డాలర్ల వద్ద ముగిసింది.

ఇక శుక్రవారం అమెరికా స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌ 179 పాయింట్లు (0.73 శాతం) నష్టపోయి 24,285 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ 33 పాయింట్లు (0.48 శాతం) కోల్పోయి 6,939 వద్ద స్థిరపడింది. ఎస్‌ అండ్‌ పీ 17 పాయింట్లు (0.66 శాతం) నష్టపోయి 2,632 దగ్గర ముగిసింది. 
 



You may be interested

రూ.5,000 కోట్లను సమీకరించనున్న ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌

Saturday 24th November 2018

ముంబై: ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌కు చెందిన ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ విభాగం నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.రూ.5,000 కోట్లను సమీకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ షెల్ఫ్ ప్రాస్పెక్టస్‌ను శనివారం ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలకు అందజేసింది. అయితే, ఈ మొత్తాన్ని ఒకేసారి సమీకరిస్తుందా..లేదంటే, ఏడాదిలో పలుమార్లు పబ్లిక్‌ ఇష్యూకు రావడం ద్వారా సమీకరించనుందా అనే విషయం ఇంకా తేలాల్సిఉంది. 

ప్రాపర్టీకలకు అడ్డా హనీగ్రూప్‌

Saturday 24th November 2018

 – ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు అన్నీ ఒక్క చోటే – 230 నిర్మాణ సంస్థలు; 360 ప్రాజెక్ట్‌లతో ఒప్పందం – ప్రస్తుతం 310 మంది ఉద్యోగులు; ఏడాదిలో 1,000 మంది లక్ష్యం – ‘స్టార్టప్‌ డైరీ’తో హనీగ్రూప్‌ సీఎండీ ఓబుల్‌ రెడ్డి అపార్ట్‌మెంట్స్, ప్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు ఏవైనా కానివ్వండి.. ఒక్కో దానికి ఒక్కో నిర్మాణ సంస్థను సంప్రదించాల్సిన అవసరం లేదు. జస్ట్‌! హనీగ్రూప్‌లో లాగిన్‌ అయితే చాలు. ఒకే చోట అన్ని రకాల

Most from this category