STOCKS

News


ఇండియన్‌ ఏడీఆర్‌లు డౌన్‌..

Saturday 8th December 2018
Markets_main1544248273.png-22766

  • వేదాంత ఏడీఆర్‌ 2 శాతానికి పైగా పతనం

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లన్నీ తగ్గాయి. వేదాంత ఏడీఆర్‌ గరిష్టంగా 2 శాతానికి పైగా పడిపోతే.. మిగతా వాటి ఏడీఆర్‌లు 1 శాతానికి పైగా క్షీణించాయి. 
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.75 శాతం తగ్గుదలతో 11.26 డాలర్లకు క్షీణించింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అధిక వ్యాల్యూమ్స్‌తో 1.42 శాతం క్షీణతతో 9.69 డాలర్లకు తగ్గింది. విప్రో ఏడీఆర్‌ 1.15 శాతం తగ్గుదలతో 5.15 డాలర్లకు క్షీణించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.37 శాతం క్షీణతతో 100.46 డాలర్లకి తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.21 శాతం తగ్గుదలతో 9.82 డాలర్లకి క్షీణించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 0.87 శాతం క్షీణతతో 37.74 డాలర్లకి తగ్గింది. ఇక వేదాంత ఏడీఆర్‌ 2.25 శాతం తగ్గుదలతో 10.84 డాలర్లకు పతనమైంది. 



You may be interested

ఫేస్‌బుక్‌ మరింత బైబ్యాక్‌!

Saturday 8th December 2018

షేర్ల పతనంతో తీవ్ర ఆందోళనలకు గురవుతున్న ఇన్వెస్టర్లకు ఊరట కలిగించేందుకు ఫేస్‌బుక్‌ కంపెనీ 9మిలియన్‌ డాలర్ల విలువైన అదనపు బైబ్యాక్‌ ఇష్యూను ప్రకటించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా కారణంగా జరిగిన సమాచార దుర్వినియోగం కుంభకోణంతో పాటు యూరోపిన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగే ప్రక్రియ ‘‘బ్రెగ్జిట్‌’’కు నిర్వహించిన ఓటింగ్‌లో ఓటర్లను ప్రభావితం చేసిందనే ఆరోపణ ఫేస్‌బుక్‌పై వచ్చాయి. రానున్న రోజుల్లో బలహీనమైన ఆదాయం ఉంటుందనే అంచనాలతో పాటు, వాల్‌స్ట్రీల్‌లో టెక్నాలజీ షేర్ల

వాల్‌ స్ట్రీట్‌ మళ్లీ ఢమాల్‌..

Saturday 8th December 2018

శుక్రవారం భారీగా పతనమైన ఇండెక్స్‌లు డౌజోన్స్‌ 559 పాయింట్లు డౌన్‌ వారంలో 4 శాతానికి పైగా క్షీణించిన ఇండెక్స్‌లు అమెరికా మార్కెట్లు శుక్రవారం మళ్లీ భారీగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పడిపోతే. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ ఏకంగా 3 శాతానికి పైగా పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.24 శాతం లేదా 559 పాయిం‍ట్ల నష్టంతో 24,388 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.33 శాతం

Most from this category