STOCKS

News


ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌కు రూ.119 కోట్ల నష్టాలు

Thursday 15th August 2019
Markets_main1565851913.png-27781

న్యూఢిల్లీ: 
ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ (ఐబీఆర్‌ఈఎల్‌) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.119 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.117 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.835 కోట్ల నుంచి రూ.869 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఆదాయం అధికంగా ఉన్నప్పటికీ, రూ.68 కోట్ల వడ్డీ భారం, రూ.98 కోట్ల అదనపు పన్ను భారం కారణంగా నికర నష్టాలు వచ్చాయని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4,800 కోట్ల మేర వాణిజ్య ఆస్తులను విక్రయించనున్నామని, ఫలితంగా రుణ రహిత కంపెనీగా అవతరిస్తామని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ షేఱ్‌ 2.3 శాతం లాభంతో రూ.80 వద్ద ముగిసింది. 



You may be interested

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రేటింగ్స్ కోత

Thursday 15th August 2019

ముంబై: గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌ (ఐబీహెచ్) దీర్ఘకాలిక కార్పొరేట్‌ రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2కి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌ వెల్లడించింది. అలాగే భవిష్యత్ అంచనాలను కూడా 'స్థిర' స్థాయి నుంచి 'నెగటివ్‌' స్థాయికి తగ్గించినట్లు తెలిపింది. దేశీయంగా ఐబీహెచ్‌తో పాటు ఇతరత్రా ఫైనాన్స్ సంస్థలు.. నిధుల లభ్యత, నిధుల సమీకరణ వ్యయాలపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఈ డౌన్‌గ్రేడ్ సూచిస్తుందని మూడీస్ పేర్కొంది. 

జేఎస్‌పీఎల్‌ నష్టాలు రూ.87 కోట్లు

Thursday 15th August 2019

గత క్యూ1 లాభం రూ.110 కోట్లు  -మొత్తం ఆదాయం రూ.9,946 కోట్లు  -10 శాతం పెరిగిన షేరు  న్యూఢిల్లీ: జిందాల్‌​ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (జేఎస్‌పీఎల్‌) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.87 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.110 కోట్ల నికర లాభం ఆర్జించామని జేఎస్‌పీఎల్‌ తెలిపింది. వ్యయాలు బాగా పెరగడంతో ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. గత క్యూ1లో రూ.9,665 కోట్లుగా ఉన్న

Most from this category