News


ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 8శాతం క్రాష్‌..!

Tuesday 25th September 2018
Markets_main1537854020.png-20553

హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లలో నెలకొన్న అమ్మకాల సునామిలో భాగంగా ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో మరో 8.50శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు రూ.990లు వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత రెండు రోజుల నష్టాల ట్రేడింగ్‌ను కొనసాగిస్తూ ఇంట్రాడేలో 8.50శాతం నష్టపోయి రూ.981.5ల కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.10:30లకు షేరు గత ముగింపు ధర(రూ.981.5)తో పోలిస్తే 5.50 శాతం నష్టంతో రూ.927.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరుసగా రూ. 752లుగా రూ.1,439.4లున్నాయి.
లిక్విడిటీ కొరత కారణంగా గత రెండు రోజులుగా మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్న నాన్‌ఫైనాన్స్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లోనూ మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. నేటి ట్రేడింగ్‌లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్ల పతనం కొంచెం ఎక్కువగానే ఉంది. నాన్‌ఫైనాన్స్‌ సంస్థల్లో నిధుల కొరత, 10ఏళ్ల ప్రభుత్వ బాం‍డ్ల ఈల్డ్‌ కూడా 8శాతానికి పైగా చేరుకోవడంతో బాండ్‌ మార్కెట్లలో లిక్విడిటీ కొరవడింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వడ్డీ భారం పెరగవచ్చనే అంచనాలు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో నెలకొన్నాయి. ఫలితంగా పలు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి.



You may be interested

క్రూడ్‌ బుల్లిష్‌

Tuesday 25th September 2018

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో తగ్గిన సరఫరాను ఒపెక్‌ దేశాలు పూర్తి చేయవనే అంచనాలు ఇందుకు ప్రధాన కారణం. అలాగే ఆర్థిక, రాజకీయ అస్థిరత పరిస్థితుల వల్ల వెనెజులలో క్రూడ్‌ ఉత్పత్తి తగ్గడం మరో నెగటివ్‌ అంశం. మిలిటెంట్‌ యాక్టివిటీ వల్ల లిబియా, నైజీరియాల్లో ఆయిల్‌ ఉత్పత్తి ఒకేరకంగా ఉండదు. ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే అమెరికా క్రూడ్‌ ఆయిల్‌ ఇన్వెంటరీలు తగ్గుతూ వస్తున్నాయి. రూపాయిపై

ఏడాది మొత్తం 11500- 11600 రేంజ్‌లో నిఫ్టీ!

Tuesday 25th September 2018

స్టీవర్ట్‌ అండ్‌ మాక్‌రిట్చ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అంచనా గతంలో చెప్పినట్లు ఈ ఆర్థిక సంవత్సరం చివరకు నిఫ్టీ టార్గెట్‌ 11600కు అటుఇటుగా ఉంటుందని స్టీవర్ట్‌ అండ్‌ మాక్‌రిట్చ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. ప్రస్తుతం నిఫ్టీ తమ టార్గెట్‌ స్థాయికి దాదాపు 500 పాయింట్ల దిగువన ట్రేడవుతున్నా అదే టార్గెట్‌ను కొనసాగిస్తామని తెలిపింది. నిఫ్టీ 11600 పాయింట్లను మించి పరుగు తీసేంతగా ప్రేరేపించే కారణాలేవీ కనిపించడంలేదని తెలిపింది. గత నెల్లో వచ్చిన ర్యాలీ

Most from this category