STOCKS

News


ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లకు రేటింగ్‌ షాక్‌

Friday 16th August 2019
Markets_main1565936903.png-27806

  • 10శాతం నష్టపోయిన షేర్లు

గృహ, ఫైనాన్స్‌ రంగంలో సేవలు అందించే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌ (ఐబీహెచ్) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 10శాతం పతనమయ్యాయి. మూడీస్‌ రేటింగ్‌ ఏజెన్సీ కార్పోరేట్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. దేశీయంగా ఐబీహెచ్‌తో పాటు ఇతరత్రా ఫైనాన్స్ సంస్థలు నిధుల లభ్యత, నిధుల సమీకరణ వ్యయాలపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కంపెనీ దీర్ఘకాలిక కార్పొరేట్‌ రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2కి డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌ వెల్లడించింది. అలాగే అవుట్‌లుక్‌ అంచనాలను కూడా ‘‘స్థిరత్వం’’ స్థాయి నుంచి నెగిటివ్‌ స్థాయికి తగ్గిస్తున్న ఏజెన్సీ తెలిపింది. ఫలితంగా నేడు ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో గత ముగింపు(రూ.551.3)తో పోలిస్తే 5శాతం నష్టంతో  రూ. 551.3ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేర్లు ఒకదశలో 10శాతం వరకు క్షీణించి రూ. 498.00 వద్ద ఇంట్రాడే కనిష్టానికి తాకాయి. మధ్యాహ్నం గం.11:00లకు షేర్లు 6.50శాతం నష్టంతో రూ.515.60 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 425.40  రూ.1309.95లుగా నమోదయ్యాయి. 



You may be interested

బేర్‌ మార్కెట్లో నేనొక బుల్‌ని

Friday 16th August 2019

‘నేను బేర్‌ మార్కెట్లో బుల్‌ని. నేను ఇప్పటికీ కూడా బుల్లిష్‌గానే ఉన్నాను. అంతేకాకుండా పూర్తిగా పెట్టుబడులు కూడా పెట్టాను. నా స్థితి మారలేదు కానీ మార్కెట్‌లోని పరిస్థితులు స్పష్టంగా మార్పు చెందాయి’ అని మోతీలాల్ ఓస్వాల్, ఎండి సహ వ్యవస్థాపకుడు, రామ్‌దేవ్‌ అగర్వాల్ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... దీర్ఘకాల బేర్‌ మార్కెట్‌.. దేశియ మార్కెట్లు బుధవారం భారీ నష్టాన్ని చూశాయి. ప్రస్తుతం మార్కెట్లు దీర్ఘకాల బేర్‌

అయిదు నిముషాల్లోనే బ్యాటరీ చార్జింగ్‌

Friday 16th August 2019

ఆటోను అభివృద్ధి చేసిన అదరిన్‌ ఇంజనీరింగ్‌ అక్టోబరు నుంచి భారత్‌లో అందుబాటులోకి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- భారత ఆటోమొబైల్‌ రంగంలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్‌’ హాట్‌ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఉన్న కంపెనీలు అధిక సామర్థ్యమున్న బ్యాటరీల తయారీపై ఫోకస్‌ చేశాయి. ఈవీ టెక్నాలజీలో ఉన్న సింగపూర్‌ సంస్థ షాడో గ్రూప్‌ అనుబంధ కంపెనీ అయిన బెంగళూరుకు చెందిన అదరిన్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీస్‌ ఓ అడుగు ముందుకేసి అల్ట్రా కెపాసిటర్‌ బ్యాటరీని

Most from this category