STOCKS

News


వచ్చే ఏడాది కూడా మనమే బెస్ట్‌!

Friday 28th December 2018
Markets_main1545978029.png-23285

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా
ఈ ఏడాది ఇతర దేశాల ఈక్విటీలతో పోలిస్తే మన మార్కెట్లు మంచి ప్రదర్శనే నమోదు చేశాయని, ఇదే జోరు కొత్త ఏడాది కూడా కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి వీకే శర్మ అభిప్రాయపడ్డారు. యూఎస్‌ మార్కెట్లు ఉన్నట్లుండి బేర్‌ జోన్‌లోకి వచ్చాయని, దీంతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్‌కావచ్చని చెప్పారు. బ్యాంకింగ్‌ బాగోగులపై యూఎస్‌ ప్రభుత్వం కన్ను సారించిందన్న వార్తలతో అమెరికా మార్కెట్లు భారీగా పతనమయింది. ఈ బలహీనత కొనసాగి ప్రపంచం మరోమారు మాంద్యంలోకి జారుకున్నా మన మార్కెట్లకేమీ కాదని, ఇతర మార్కెట్ల కన్నా మనవే మంచి ప్రదర్శన ఇస్తాయని శర్మ చెప్పారు. నిఫ్టీ పదివేల పాయింట్లను కాపాడుకున్నంతవరకు ఏమీ కాదన్నారు. మరికొన్నినెలల్లో ఎలక‌్షన్లున్నందున ఇన్వెస్టర్లు రక్షణాత్మక షేర్లను ఎంచుకుంటారని, ఈ తరుణంలో వినిమయం, ఐటీ రంగాలను పరిశీలించవచ్చని సూచించారు. క్యాపిటల్‌ గూడ్స్‌ రంగంలో పికప్‌ కనిపిస్తోందని చెప్పారు. సొంతంగా షేర్లు కొని నిర్వహించుకోలేకుంటే నిఫ్టీ ఈటీఎఫ్‌లో సిప్‌ను ఎంచుకోవాలని, ప్రస్తుతం ఆకర్షణీయమైన వాల్యూ వద్ద ఉందని తెలిపారు.
ఏడాది కాలానికి రెండు షేర్లను ఆయన రికమండ్‌ చేశారు.
యాక్సిస్‌ బ్యాంకు: టార్గెట్‌ రూ. 815. బ్యాంకు గడ్డుకాలం ముగిసిపోతోంది. నికర ఎన్‌పీఏలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆస్తుల నాణ్యత రాబోయే రోజుల్లో మరింత మెరుగుపడుతుంది. 
ఐటీసీ: టార్గెట్‌ రూ. 340. రిస్కురివార్డు పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. క్రమంగా పొగాకేతర వ్యాపారంలో భారీగా విస్తరిస్తోంది. పొగాకు వ్యాపారం సైతం కోలుకొంటోంది. జీఎస్‌టీ అమలుతో పన్ను ఒడిదుడుకులు తగ్గాయి. 



You may be interested

బ్యాంకింగ్‌ షేర్ల జోరు

Friday 28th December 2018

కేంద్రం 7 ప్రభుత్వ రంగ బ్యాంకుల‌కు రూ.28615 కోట్ల మూల‌ధ‌నం సమకూరుస్తున్నట్లు ప్రక‌టించ‌డంతో పాటు అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో శుక్రవారం బ్యాంకింగ్ రంగ షేర్లు పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతం, ప్రై‍్రవేట్‌ రంగ ఇండెక్స్‌, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం చొప్పున ర్యాలీ చేశాయి. ద్రవ్య కొరతను ఎదుర్కొంటున్న ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ డిసెంబర్‌ 31లోగా

స్థిరంగా పసిడి

Friday 28th December 2018

ఆర్థిక మందగమన భయాల నేపథ్యంలో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 1డాలరు స్వల్ప నష్టంతో 1,279.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే నేడు ఆసియాలో పలు ఈక్విటీ మార్కెట్లలో జరుగుతున్న ర్యాలీ పసిడి ధరకు ప్రతికూలంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక గత ట్రేడింగ్‌లో పసిడి ధర 8డాలర్ల వరకూ ర్యాలీ చేసింది. డాలర్‌ బలహీనత, ప్రపంచమార్కెట్లో రికవరీ

Most from this category