STOCKS

News


పన్నెండు వేల పాయింట్లు పక్కా!

Friday 10th August 2018
Markets_main1533889755.png-19121

వర్ధమాన మార్కెట్లలో భారత్‌ బెస్ట్‌
మార్కెట్‌ నిపుణుడు అతుల్‌ సూరి
దేశీయ మార్కెట్లు మార్చి కనిష్ఠాల నుంచి కోలుకొని ఆల్‌టైమ్‌ హైని తాకాయి. ఈ నేపథ్యంలో గత రెండు మూడునెలల్లో వర్ధమాన మార్కెట్లలో ఇండియా ఈక్విటీ మార్కెట్లే బెస్ట్‌ అని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు, మారథాన్‌ ట్రెండ్స్‌ సీఈఓ అతుల్‌ సూరీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం యూఎస్‌ మార్కెట్లు తమ ఆల్‌టైమ్‌ హైని చేరలేక అవస్థపడుతున్నాయని, ఎంఎస్‌సీఐ వర్ధమాన మార్కెట్‌ సూచీ తన జీవిత గరిష్ఠానికి ఇంకా 20 శాతం దూరంలోనే ఉందని ఆయన గుర్తు చేశారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయంగా బుల్‌ మార్కెట్‌ కొనసాగుతుందని అంచనా వేశారు. ఇప్పటివరకు దిగాలుపడి కుదేలయిన స్టాకులు ఇకమీదట అప్‌మూవ్‌ చూపుతాయన్నారు. నిఫ్టీ తాజా ర్యాలీలో 12,000 పాయింట్లను చేరడం చూడవచ్చని అంచనా వేశారు. మధ్యలో కరెక‌్షన్‌ రావడం సహజమని, అయితే సూచీల్లో బుల్‌జోరే ఉంటుందని వివరించారు. గత ఫిబ్రవరి కరెక‌్షన్‌లో సూచీలు సుమారు 10 శాతం పతనమయ్యాయని, తిరిగి కోలుకున్నాయని, ప్రతి పతనంలో మార్కెట్‌ను నడిపించే స్టాకులు మారుతుంటాయని చెప్పారు. ప్రస్తుతం నిఫ్టీకి 10000 పాయింట్లకు అటుఇటుగా గట్టి మద్దతు ఉంటుందన్నారు. 
వివిధ రంగాలపై అతుల్‌ అభిప్రాయాలు..
- బ్యాంకులు: ఇప్పటివరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రాబ్యాంక్‌ షేర్లు బ్యాంకు సూచీని ముందుకు నడిపించాయి. ఇకపై ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ పనిచేస్తాయని అంచనా. వాణిజ్య బ్యాంకులు, కొన్ని పీఎస్‌బీలు ఇకమీదట ర్యాలీలో పాలుపంచుకొంటాయి.
- చమురు, గ్యాస్‌: ఈరంగంలోని ఆర్‌ఐఎల్‌ నెల రోజుల్లో 21 శాతం దూసుకుపోయింది. ఏడెనిమిదేళ్ల కన్సాలిడేషన్‌ అనంతరం ఆర్‌ఐఎల్‌ ర్యాలీ ఆరంభించిందని, ఇకమీదట అప్‌మూవ్‌ కొనసాగిస్తుందని అంచనా.
- వినిమయం: ఈ రంగంలో స్టాకులు మార్కెట్‌ పతనమవుతున్నా ముందుకే సాగుతున్నాయి. వీటి ఫలితాలు సైతం బాగున్నాయి. ఈ రంగంపై ఓవర్‌వెయిట్‌ ధృక్పథంతో ఉండొచ్చు. కేవలం ఎఫ్‌ఎంసీజీ రంగమనే కాకుండా వినిమయం థీమ్‌లోని ఇతర రంగాల కంపెనీలను సైతం పరిశీలించవచ్చు. స్వల్పకాలానికి ఈ రంగం జోలికి పోవద్దని సూచన.
- మెటల్స్‌: ట్రేడ్‌ వార్‌ కారణంగా మెటల్స్‌ రంగంపై బాగా ఒత్తిడి పెరిగింది. డాలర్‌ మరింత బలపడితే ఈ రంగం మరిన్ని ఇక్కట్లను ఎదుర్కోవచ్చు. 
- ఐటీ: డాలర్‌ బలోపేతం చెందితే ఐటీ రంగం మరో దఫా అప్‌మూవ్‌ చూపుతుంది. 
- ఫార్మా: ఇప్పటికి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఓపికతో ఉండే ఇన్వెస్టర్లు ఈ స్టాకులను కూడబెట్టడం ఆరంభించవచ్చు. 

 



You may be interested

ఈ రెండు స్టాక్స్‌ కొనొచ్చు: సెంట్రమ్‌

Friday 10th August 2018

సెం‍ట్రమ్‌.. బజాజ్‌ ఆటో, హిందుస్తాన్‌ జింక్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వీటిని ఒకసారి పరిశీలిస్తే.. స్టాక్‌: బజాజా ఆటో ఇండస్ట్రీ: ఆటోమొబైల్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.2,656 టార్గెట్‌ ప్రైస్‌: రూ.3,188 సెంట్రమ్‌.. బజాజ్‌ ఆటోపై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ మార్కెట్‌ వాటాపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని తెలిపింది. మార్కెట్‌లో 20 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకునే దాకా పలు ప్రొడక్టులను తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.

యస్‌ బ్యాంక్‌ జూమ్‌

Friday 10th August 2018

ముంబై:- ప్రైవేట్‌ రంగ దిగ్గజం యస్‌బ్యాంకు షేరు శుక్రవారం లాభాల బాట పట్టింది. నేటి ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌లో 2.61శాతం వరుకు ర్యాలీ చేసింది. నేడు షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ.382.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో  పలు బ్యాకింగ్‌ రంగ షేర్లు నష్టాల బాట పట్టినప్పటికీ యస్‌ బ్యాంకు షేరు లాభాల్లో ట్రేడైంది. ఒక దశలో 2.61శాతం వరకూ  ర్యాలీ చేసి

Most from this category