STOCKS

News


భారత ఈక్విటీలపై ఎఫ్‌పీఐలకు తగ్గుతున్న మోజు

Wednesday 9th January 2019
Markets_main1547011650.png-23475

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) భాగస్వామ్యం తగ్గుముఖం పడుతోంది. డిసెంబర్‌లో దేశీయ ఈక్విటీల్లోకి  విదేశీ నిధుల ప్రవాహం(మొత్తం మార్కెట్‌ క్యాప్‌తో పోలిస్తే) ఒక శాతం దిగువకు పడిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇదే విదేశీ నిధుల ప్రవాహం మొత్తం మార్కెట్‌ క్యాప్‌లో 3 శాతం ఉండేది. దీంతో పాటు మార్కెట్‌ మొత్తం వాల్యూంల్లో ఎఫ్‌పీఐల ట్రేడింగ్‌ వాల్యూంలు డిసెంబర్‌లో 30 శాతానికి పడిపోయాయి. మూడేళ్ల క్రితం ఎఫ్‌పీఐల ట్రేడింగ్‌ వాల్యూంలు 50 శాతమున్నాయి. 

 

  • 2018లో దేశంలోని ఈక్విటీ, డెట్‌ సాధనాల్లోనుంచి 1132 కోట్ల డాలర్ల విదేశీ నిధుల ఉపసంహరణ జరిగింది. కేవలం ఈక్విటీల్లోనే ఎఫ్‌పీఐలు 450 కోట్ల డాలర్ల అమ్మకాలు జరిపాయి.
  • 2008 ప్రపంచ మందగమనానంతరం ఇంత మొత్తంలో నిధుల ఉపసంహరణ జరగడం గతేడాదే ప్రథమం. అంతేకాకుండా 2008 తర్వాత ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా మారడం కూడా ఇదే తొలిసారి.
  • 2013-16 సమయంలో దేశంలోకి వచ్చిన సరాసరి ఎఫ్‌పీఐలతో పోలిస్తే 2016-18 సమయంలో నాలిగింట ఒకవంతు విలువైన విదేశీ పెట్టుబడులే వచ్చాయి.
  • బీఎస్‌ఈ 100 కంపెనీల ఉమ్మడి వాటాలో ఎఫ్‌పీఐలకు సరాసరిన 22 శాతం వాటా ఉంది.
  • డిసెంబర్‌ 15 నాటికి దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల ఆధ్వర్యంలోని అసెట్స్‌ విలువ 37600 కోట్ల డాలర్లుంది. ఇది భారత మార్కెట్‌ మొత్తం క్యాపిటలైజేషన్‌లో 18.3 శాతానికి సమానం. 


FPI

You may be interested

పసిడి...ప్రపంచ మార్కెట్లో తగ్గుదల-దేశీయంగా పెరుగుదల

Wednesday 9th January 2019

గతవారం 1300 డాలర్లను తాకిన పసిడి ధర ఈ వారంలో వెనకడుగు వేస్తోంది. ఆసియా మార్కెట్లో బుధవారం ఉదయం గం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు నష్టపోయి 1282 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఫలప్రదం కావచ్చనే అంచనాలతో ఈ వారంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల పట్టాయి. అమెరికా మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగియగా, ఆసియా

సెన్సెక్స్‌ 200 పాయింట్లు గ్యాప్‌అప్‌

Wednesday 9th January 2019

నిఫ్టీ 10,850 పాయింట్ల పైకి తాజా అమెరికా-చైనా చర్చలతో ఏడాదికాలంగా ఇన్వెస్టర్లను కలవరపెడుతున్న ట్రేడ్‌వార్‌. ముగుస్తుందన్న అంచనాల ఫలితంగా బుధవారం భారత్‌ సూచీలు భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లు జంప్‌ చేసి 36,180 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 10,862 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. 7,8 తేదీల్లో ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చల కాలపరిమితిని అనూహ్యంగా మూడోరోజుకు సైతం పొడిగించడంతో ఒక ఒప్పందం

Most from this category