STOCKS

News


ట్రేడర్లు బేరిష్‌..ఇండెక్స్‌ ఫ్యూచర్ల ప్రీమియం కట్‌

Friday 26th October 2018
Markets_main1540550357.png-21500

సమీపరోజుల్లో మార్కెట్‌ మరింత క్షీణిస్తుందన్న ట్రేడర్ల అంచనాల కారణంగా ఇండెక్స్‌ ఫ్యూచర్లలో చాలావరకూ ప్రీమియం శుక్రవారం హరించుకుపోయింది. అక్టోబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ప్రారంభపు రోజునాడే ప్రీమియం కట్‌కావడం టెక్నికల్‌గా బేరిష్‌ సంకేతం. సెప్టెంబర్‌ సిరీస్‌లో 7 శాతంపైగా పతనం చూసిన నిఫ్టీ అక్టోబర్‌ సిరీస్‌ తొలినాళ్లలో కొంత రికవరీ వుంటుందన్న అంచనాలతో గురువారం నిఫ్టీ ఫ్యూచర్‌...స్పాట్‌తో పోలిస్తే  60 పాయింట్ల ప్రీమియంతో ముగిసింది. శుక్రవారం స్పాట్‌ నిఫ్టీ 95 పాయింట్ల క్షీణతతో 10,030 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ ఫ్యూచర్‌ 131 పాయింట్ల మేర పతనమై 10,043 పాయింట్ల వద్ద ముగిసింది. తద్వారా ఈ ఇండెక్స్‌ ఫ్యూచర్లో ప్రీమియం 13 పాయింట్లకు పడిపోయింది. గురువారం భారీ రోలోవర్స్‌ జరిగిన నిఫ్టీ ఫ్యూచర్లో శుక్రవారం ఓపెన్‌ ఇంట్రస్ట్‌ మరో 8 శాతం మేర పెరిగింది. ప్రీమియం తగ్గతూ, ఓపెన్‌ ఇంట్రస్ట్‌ పెరగడం షార్ట్‌ పొజిషన్ల పెరుగుదలను సూచిస్తోంది. అలాగే బ్యాంక్‌ నిఫ్టీ ఫ్యూచర్లో కూడా ప్రీమియం భారీగా పడిపోయింది. బ్యాంక్‌ నిఫ్టీ స్పాట్‌ 396 పాయింట్ల తగ్గుదలతో 24,420 పాయింట్ల సమీపంలో ముగియగా, ఈ ఫ్యూచర్‌ 488 పాయింట్ల క్షీణతతో 24,465 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అంటే క్రితం రోజుతో పోలిస్తే కేవలం ప్రీమియమే 100 పాయింట్ల వరకూ పడిపోయిందన్న మాట. అధిక ఎన్‌పీఏలతో సతమతమవుతున్న ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఎస్‌బీఐలు...ఆర్థిక ఫలితాల్ని వచ్చే కొద్దిరోజుల్లో వెల్లడించనున్న నేపథ్యంలో బ్యాంక్‌ నిఫ్టీ ఫ్యూచర్లో తాజా షార్టింగ్‌ను సూచిస్తూ ప్రీమియం తగ్గడం గమనార్హం. 
 



You may be interested

భారత్‌ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు సానుకూలమే: మొబిస్‌

Friday 26th October 2018

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని రంగాల్లో మరో 5-10 శాతం మేర కరెక్షన్‌ ఉంటుందని మొబిస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడు, సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ మార్క్‌ మొబిస్‌ అన్నారు. మిగిలిన ప్రతికూల అంశాలన్నింటినీ ఇప్పటికే మార్కెట్లు గమనంలోకి తీసుకున్నట్టు చెప్పారు. భారత మార్కెట్లో పెట్టుబడులకు ఎంతో ఆసక్తితో ఉన్నానని, భారత ప్రభుత్వం అనుమతుల విషయంలో మరింత క్రీయాశీలంగా వ్యవహరించాలన్నారు. ప్రక్రియలను మరింత క్రమబద్ధం చేయాలని, అప్పుడు పెట్టుబడులు మరింత సులభంగా

7నెలల కనిష్టానికి నిఫ్టీ

Friday 26th October 2018

ప్రపంచమార్కెట్లో అస్థిరత భారత్‌ మార్కెట్‌ను మరోసారి దెబ్బతీసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగివచ్చినప్పటికీ, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి రీకవర అయినప్పటీకీ మార్కెట్‌ కోలుకోలేకపోయింది.  ఆసియా నుంచి యూరప్‌తో పాటు అమెరికా మార్కెట్‌ ఫ్యూచర్ల నష్టాల ట్రేడింగ్‌తో కారణంగా దేశీయ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాలతో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ సూచీ 341 పాయింట్లు నష్టపోయి 33,349 వద్ద,

Most from this category