STOCKS

News


డిస్కౌంట్లో ఇండెక్స్‌ ఫ్యూచర్లు

Monday 22nd October 2018
Markets_main1540187880.png-21354

సోమవారం భారీగ్యాప్‌అప్‌తో మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే ఇండెక్స్‌ ఫ్యూచర్లు డిస్కౌంట్లోకి మళ్లిపోయాయి. దాంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సైతం ట్రేడింగ్‌ లాభాల్ని పోగొట్టుకున్నాయి. 10,410 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వెనువెంటనే 10,289 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. ఉదయం 11 గంటల సమయానికి స్పాట్‌ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 10,324 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ ఫ్యూచర్‌ 10 పాయింట్ల డిస్కౌంట్‌తో 10,314 పాయింట్ల వద్ద కదులుతోంది. గత శుక్రవారం స్పాట్, ఫ్యూచర్‌ నిఫ్టీలు..రెండూ 10,304 పాయింట్ల వద్ద ముగిసాయి. రూ. 7 డివిడెండు చెల్లింపు కోసం ఈ నెల 25న రికార్డుతేదీని వెల్లడించినందున, ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ ఫ్యూచర్, స్పాట్‌ ధరతో పోలిస్తే దాదాపు రూ. 6 డిస్కౌంట్‌తో ట్రేడవుతున్నప్పటికీ, గత ఐదు రోజులుగా ఇదే డిస్కౌంట్‌ ఈ ఫ్యూచర్లో కొనసాగుతోంది. తాజాగా పలు హెవీవెయిట్‌ షేర్లకు చెందిన ఫ్యూచర్లు స్వల్ప డిస్కౌంట్‌లోకి మళ్ళిన ఫలితంగా నిఫ్టీ ఫ్యూచర్‌లో  10 పాయింట్ల డిస్కౌంట్‌ ఏర్పడింది. అక్టోబర్‌ డెరివేటివ్‌ కాంటాక్టులు మరో నాలుగురోజుల్లో ముగియనున్న నేపథ్యంలో బుల్‌ ఆఫ్‌లోడింగ్‌ ఫలితంగా ఫ్యూచర్లు డిస్కౌంట్‌లోకి జారిపోయాయని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బ్యాంక్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ సైతం భారీ డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది. ఉదయం 11 గంటల సమయానికి బ్యాంక్‌ నిఫ్టీ స్పాట్‌ 25,330 పాయింట్ల వద్ద కదులుతుండగా, ఈ ఫ్యూచర్‌ దాదాపు 65 పాయింట్ల డిస్కౌంట్‌తో 25,265 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Monday 22nd October 2018

క్యు2లో సంతృప్తికర ఫలితాలు ప్రకటించడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. సోమవారం ట్రేడింగ్‌లో షేరు 1.64 శాతం లాభంతో ట్రేడవుతోంది.  షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి.. 1. క్రెడిట్‌ సూసీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2500. మార్కెట్‌లో వాటా పెంచుకుంటూపోతుంది. వచ్చే ఏడాది ఆర్‌ఓఏ బలంగా 3.4 శాతానికి చేరవచ్చని అంచనా. అదేవిధంగా ఆర్‌ఓఈ 18 శాతానికి పెరగవచ్చు. ఇతర ప్రైవేట్‌ బ్యాంకులతో పోలిస్తే చాలా

నెక్ట్స్‌ ర్యాలీ బ్యాంకులతోనే!!

Monday 22nd October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో తదుపరి ర్యాలీ బ్యాంకులతో ఉంటుందని, ఐటీతో కాదని అవెండస్‌ క్యాపిటల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆండ్రూ హోలండ్‌ తెలిపారు. చాలా వరకు ప్రతికూలతలు సెప్టెంబర్‌ నెలలోనే మార్కెట్‌పై ప్రభావం చూపించేశాయని పేర్కొన్నారు. వ్యాల్యుయేషన్స్‌ చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఆర్‌బీఐ ప్రస్తుత పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించిందని, లిక్విడిటీకి సంబంధించి ఇది మంచి చర్య అని కితాబిచ్చారు. అలాగే ఆర్‌బీఐ లిక్విడిటీ మెరుగుదలకు

Most from this category