STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం...భారీ పతనం

Tuesday 13th August 2019
Markets_main1565689758.png-27740

మార్కెట్‌ పతనంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లిమిడెట్‌ షేర్లు 5శాతం క్షీణించగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 3శాతం నష్టపోయాయి. ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజి కలిగిన ఈ ద్వయం పతనంతో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు భారీగా పాయింట్లను కోల్పోయాయి. నేడు నిఫ్టీ కోల్పోయిన 183.55 పాయింట్లలో ఈ రెండు షేర్లవే 75 పాయింట్లు కావడం విశేషం.
హెచ్‌డీఎఫ్‌సీ :- నేడు బీఎస్‌ఈలో రూ.2166.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేర్లు నష్టాల బాట పట్టడంతో ఒకదశలో 5శాతం వరకూ క్షీణించి రూ. 2098.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గత ముగింపు(రూ.2211.9)తో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.2101.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.2098.00 రూ.2213.05లుగా ఉన్నాయి. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.2282.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేర్లు నష్టాల బాట పట్టడంతో ఒకదశలో 3.50 శాతం వరకు క్షీణించి రూ. 2202.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గత ముగింపు(రూ.2281.75)తో పోలిస్తే 2.77శాతం నష్టంతో రూ.2220.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.2202.65 రూ.2282.00లుగా ఉన్నాయి.



You may be interested

ఏడాది కనిష్ఠానికి 99 స్టాకులు

Tuesday 13th August 2019

ఎన్‌ఎస్‌ఈ మంగళవారం ట్రేడింగ్‌లో సుమారుగా 99 స్టాకులు వాటి 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. అరవింద్ ఫ్యాషన్స్, భండారి హోసిరీ ఎక్స్‌పోర్ట్స్‌, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా షేర్లు వాటి 52 వారాల కనిష్టాన్ని తాకాయి. వీటితో పాటు కాఫీ డే ఎంటర్ప్రైజెస్, కాక్స్ అండ్‌ కింగ్స్, జీఎఫ్ఎల్, ఐజీ పెట్రోకెమికల్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, లెమన్ ట్రీ హోటల్స్, షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా స్టీల్, సన్

అమ్మకాల ఒత్తిడిలో ఐటీ షేర్లు

Tuesday 13th August 2019

రూపాయి బలహీనపడినప్పటికీ.., మం‍గళవారం ఐటీ షేర్ల అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం పతనమైంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్ల పతనం 2శాతం వరకు క్షీణించడం ఇతర ఐటీ షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. నేడు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 15,809 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఐటీ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి

Most from this category