STOCKS

News


ఇండెక్స్‌ ర్యాలీలో ఏయే షేర్ల వాటా ఎంత..?

Tuesday 12th March 2019
Markets_main1552387659.png-24564

అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీతో పాటు ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతవరణం, డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం తదితర కారణాలతో సూచీలు రెండో రోజూ  లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 481 పాయింట్లు లాభపడి 37,535 వద్ద, నిఫ్టీ 133 పెరిగి 11,301 వద్ద స్థిరపడ్డాయి.
-    నేడు నిఫ్టీ ఆర్జించిన మొత్తం 152 పాయింట్ల లాభంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 22 పాయింట్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 22 పాయింట్లును, ఐసీఐసీఐ బ్యాంక్‌ 20 పాయిం‍ట్లను, ఎల్‌ అండ్‌ టీ 15 పాయింట్లను, హెచ్‌డీఎఫ్‌సీ 14పాయింట్లను అందించాయి.
-    సెన్సెక్స్‌ సూచీ సైతం ఇంట్రాడేలో 532 పాయింట్లను ఆర్జించింది. మొత్తం పాయింట్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 92 పాయింట్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 81 పాయింట్లును, ఐసీఐసీఐ బ్యాంక్‌ 75 పాయిం‍ట్లను, హెచ్‌డీఎఫ్‌సీ 55 పాయింట్లను, ఎల్‌ అండ్‌ టీ 54 పాయింట్ల సమకూర్చాయి. 
-    వీటిలో నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు తమ జీవితకాల గరిష్టస్థాయిలను నమోదు చేసుకున్నాయి.



You may be interested

స్మాల్‌ క్యాప్‌ ర్యాలీ కొనసాగేనా?!

Tuesday 12th March 2019

స్మా్‌ల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీల నాన్‌స్టాప్‌ ప్రతికూల పనితీరు ఇక ముగిసినట్టేనా...? సూచీల పనితీరు, స్టాక్స్‌ ర్యాలీని గమనిస్తే విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థలు ఇదే అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్‌ అనిల్‌కుమార్‌ గోయల్‌ పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ నెల రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 18 నుంచి 46 శాతం పెరగడం గమనార్హం. బాగా పడి ఉండడం, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి తాజా నిధుల రాకతో ప్రధాన సూచీల ర్యాలీకి మద్దతుగా మిడ్‌, స్మాల్‌క్యాప్‌

మార్కెట్‌ మరో హైజంప్‌

Tuesday 12th March 2019

481 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ 11300పైన ముగిసిన నిఫ్టీ  అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ అండతో సూచీలు రెండోరోజూ చెలరేగిపోయాయి. ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతవరణం, డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం తదితర అంశాలు సూచీల ర్యాలీకి అండగా నిలిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 481 పాయింట్లు లాభపడి 37,535 వద్ద, నిఫ్టీ 133 పెరిగి 11,301 వద్ద స్థిరపడ్డాయి. 5నెలల తరువాత రెండురోజుల్లో అధికంగా జరిగిన ర్యాలీ ఇదేనని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌ఎస్‌లోని

Most from this category