STOCKS

News


పన్ను మినహాయింపు రూ.5 లక్షలు చేస్తే జోషే!

Wednesday 30th January 2019
Markets_main1548787541.png-23879

మధ్యంతర బడ్జెట్‌ ప్రజాకర్షణీయంగా ఉంటుందని సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అంచనా వ్యక్తం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ఓటర్లను ఆకర్షించాల్సిన ఒత్తిడిని ప్రభుత్వం ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న నేపథ్యంలో రానున్న ఐదేళ్లకు సంబంధించిన విజన్‌పై దృష్టి సారించేలా బడ్జెట్‌ ఉంటుందని తెలిపింది. జీఎస్టీ వసూళ్ల పరంగా సమస్య ఉండడంతో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం భారీగా ఉండొచ్చని అంచనా వేసింది. 

 

సెంట్రమ్‌ వెల్త్‌ అంచనాలు

  • మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన నేపథ్యంలో సాగుకు సంబంధించి భారీ సహకారాన్ని ప్రకటించొచ్చు. రైతులకు సంబంధించి ఓ ప్యాకేజీని ప్రకటించొచ్చు. అయితే, అది ద్రవ్యలోటుపై ప్రభావం చూపిస్తుంది.  
  • జీఎస్టీ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో పేర్కొన్న లక్ష్యానికి రూ.1.5 లక్షల కోట్ల మేర (జీడీపీలో 0.8 శాతం) తగ్గొచ్చు. ఈ నేపథ్యంలో జీఎస్టీ నిబంధనల అమలు పరంగా మరింత బలమైన చర్యలు అవసరం
  • ఆదాయపన్ను ప్రామాణిక మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచితే అది రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిస్తుంది. రూ.5లక్షలకు పన్ను మినహాయింపు పెంచాలని సీఐఐ కోరిన విషయం తెలిసిందే. అంతేకాదు సెక్షన్‌ 80సీ పరిమితిని రూ.2.5లక్షలు చేయాలని కూడా ప్రతిపాదించింది. దీనివల్ల  చేతిలో అధిక మిగులు ఉండి, అవి పెట్టుబడులుగా క్యాపిటల్‌ మార్కెట్లోకి వస్తాయన్నది అంచనా. 
  • ప్రభుత్వ ప్రజాకర్షణ విధానాలకు చోటిస్తే వినియోగానికి, ఆర్థిక వృద్ధికి కచ్చితంగా సానుకూలమే. ప్రజల అధిక నిధుల వినియోగం ఆర్థిక వ్యవస్థకు కలిసొస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా బదిలీ చేసే సులభమైన చర్యలను మార్కెట్లు స్వాగతిస్తాయి. You may be interested

మల్టీ బ్యాగర్లు కావాలా..? 

Wednesday 30th January 2019

యాంబిట్‌ క్యాపిటల్‌ భవిష్యత్తులో భారీ వృద్ధి అవకాశాలున్న 30 స్టాక్స్‌తో ఓ జాబితాను ‘టెన్‌ బ్యాగర్స్‌ 8.0’ పేరుతో రూపొందించింది. స్టాక్‌ ఎంపికే మల్టీ బ్యాగర్‌ (పలు రెట్లు పెరగడం)ను నిర్ణయిస్తుందని తెలిసిందే. ఓ కంపెనీ వ్యాపారానికి సంబంధించి ఎన్నో అంశాలను విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో ఆ కంపెనీ వ్యాపారం ఏ విధంగా వృద్ధి చెందుతుంది, తద్వారా వాటాదారులకు లాభాలు ఏ మేరకు తెచ్చిపెడుతుందన్న విషయాలు తెలుస్తాయి. అధిక ఆర్‌వోఈ,

నెలరోజుల కోసం మూడు ట్రేడింగ్‌ సిఫార్సులు

Tuesday 29th January 2019

బడ్జెట్‌ వెలువడేవరకూ ఒక పరిమితశ్రేణిలోనే కదలవచ్చని 10,500–10,600 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి మద్దతుగా నిలవవచ్చని రిలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మాంగ్లిక్‌ అంచనావేస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పటిష్టంగా ట్రేడ్‌కావొచ్చని, బ్యాంకింగ్, ఆటో, మెటల్‌ షేర్లు బలహీనంగా వుండవచ్చన్నది ఆయన అంచనా. నెలరోజుల్లో 6 శాతం వరకూ రాబడినిచ్చే మూడు షేర్లను ఆయన సిఫార్సుచేస్తున్నారు. అవి.... టీసీఎస్‌ సిఫార్సు: బై, టార్గెట్‌: రూ. 2070, స్టాప్‌లాస్‌ రూ. 1890 ఇటీవల ఇతర

Most from this category