News


ఆదాయపన్నుపై ఐదు ప్రయోజనాలు

Saturday 2nd February 2019
Markets_main1549046864.png-23956

2019-20 ఆర్థిక సంవత్సరపు మధ్యంతర బడ్జెట్లో ఎంతో ఉపశమనం కల్పించే ఆదాయపన్ను నిర్ణయాలకు మంత్రివర్యులు చోటు కల్పించారు. ఈ నిర్ణయాలతో మధ్యతరగతి వేతన జీవులకు పెద్ద ఊరటే కలగనుంది. ఆ నిర్ణయాలను ఒక్కసారి పరిశీలించినట్టయితే...

 

ఆదాయంపై పన్ను
వ్యక్తిగత ఆదాయపన్ను రూ.2.5 లక్షలకు ప్రస్తుతం పన్ను లేదు. ఒకవేళ ఆదాయం రూ.3 లక్షలు ఉన్నా పన్ను చెల్లించక్కర్లేదన్నది ప్రస్తుతమున్న సెక్షన్‌ 87ఏ చెబుతోంది. రూ.50వేలపై 5 శాతం పన్ను కింద రూ.2,500 చెల్లించాల్సి వస్తుంది. కానీ దీనికి 87ఏ రిబేటు ఇస్తోంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.12,500కు పెంచారు. అంటే రూ.5 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదన్నమాట. ఇదెలా అంటే ఆదాయ పన్ను బేసిక్‌ మినహాయింపు రూ.2.5లక్షలుగానే ఉంటుంది. రూ.2.5లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే అప్పుడు రూ.2.5 లక్షలపై 5 శాతం చొప్పున రూ.12,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా సెక్షన్‌ 87ఏ కింద పన్ను మినహాయింపు రాయితీని రూ.12,500కు పెంచారు. దీంతో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నా పన్ను చెల్లించక్కర్లేదు. ఇదెలా అంటే సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇన్వెస్ట్‌ చేసి, మరో రూ.50,000ను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. అప్పుడు నికరంగా పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షలు ఉంటుంది. అప్పుడు రిటర్నులు ఫైల్‌ చేసి సెక్షన్‌ 87ఏ కింద రూ.12,500 పన్ను చెల్లింపు మినహాయింపును పొందొచ్చు. 

 

ప్రామాణిక తగ్గింపు
స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.40,000ను రూ.50,000 చేశారు. దీన్ని వాస్తవానికి గతేడాది బడ్జెట్‌ నుంచే తిరిగి ప్రవేశపెట్టారు. పన్ను వర్తించే ఆదాయం నుంచి నికరంగా తగ్గింపు అవకాశం ఇది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి రూ.10,000వేల పెంపుతో రూ.3,000 ఆదా అవుతుంది.

 

నోషనల్‌ రెంట్‌
ఒకరి పేరిట రెండు ఇళ్లు ఉన్నాయనుకుంటే, ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఇంట్లో యజమాని నివాసం ఉంటూ, రెండో దాన్ని అద్దెకు ఇచ్చినట్టు చట్టం పరిగణిస్తోంది. అద్దెకు ఇచ్చిన ఇంటిపై వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాలి. ఒకరు తన పేరిట ఉన్న రెండో ఇల్లును అద్దెకు ఇవ్వకుండా తానే ఉంటున్నా గానీ చట్టం పరిగణనలోకి తీసుకోవడం లేదు. కానీ ఇకపై రెండు ఇళ్లు తమ కోసమే వినియోగించుకునేవారు నోషనల్‌ రెంట్‌ పేరిట పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

 

ఇంటిపై మూలధన పన్ను
ఒక ఇల్లు అమ్మగా వచ్చిన మూలధన లాభాన్ని తిరిగి ఒక ఇంటి కొనుగోలు చేయడం ద్వారానే పన్ను మినహాయింపు ఉంది. ఇకపై ఒక ఇల్లు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రెండు ఇళ్ల కొనుగోలుకు వినియోగించినా పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, మూలధన లాభం రూ.2కోట్లలోపు ఉంటేనే ఇది వర్తిస్తుంది.

 

బ్యాంకుల్లో టీడీఎస్‌
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మించితే 10 శాతం టీడీఎస్‌ కింద మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంటాయి. దీన్ని ఆర్థిక మంత్రి రూ.40,000కు పెంచారు. అంటే డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.40,000 దాటితేనే టీడీఎస్‌ అమలు చేస్తారు.



You may be interested

మోదీ... ‘‘రియల్‌’’ మేజిక్‌

Saturday 2nd February 2019

రియల్టీ... ఇకనైనా నిలబడుతుందా? బడ్జెట్లో గృహ రంగంపై ప్రత్యేక దృష్టి రెండో ఇంటికీ మూలధన లాభాలు అందుబాటు గృహాల రాయితీలో మరో ఏడాది అమ్ముడుకాని ఇళ్లకు మరో రెండేళ్లు పన్ను ఉండదు జీఎస్‌టీ తగ్గింపుపై మంత్రుల బృందం ఏర్పాటు బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేసిన కేంద్రం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారీ నిర్మాణ సంస్థలు ప్రాజెక్టుల్ని పూర్తి చేయలేక మధ్యలోనే చేతులెత్తేస్తుండటం... అప్పటికే డబ్బులు చెల్లించి ఇళ్లకోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తుండటం కొన్నాళ్లుగా రియల్టీ రంగాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయి.

బడ్జెట్‌తో ప్రయోజనం ఎవరెవరికి?

Saturday 2nd February 2019

మధ్యంతర బడ్జెటే అయినా పలు వర్గాలకు భారీ ప్రయోజనాలతో, సంతోషపెట్టే నిర్ణయాలతో మోదీ సర్కారు 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా తాత్కాలిక బడ్జెట్‌లో ఎటువంటి విధానపరమైన నిర్ణయాలకు అవకాశం లేని సంప్రదాయాన్ని బ్రేక్‌ చేసింది. మరి ఈ  బడ్జెట్‌ వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందన్నది గమనిస్తే...    రైతులు: రెండు హెక్టార్ల (5 ఎకరాల్లోపు)ల్లోపు భూమి ఉన్న రైతుకు ఏడాదికి రూ.6,000ను మూడు వాయిదాల్లో రూ.2,000 చొప్పున ఆర్థిక సాయంగా

Most from this category