STOCKS

News


అవే తప్పులు మళ్లీ మళ్లీ... అందుకే నష్టాలు...? 

Friday 12th October 2018
Markets_main1539368753.png-21098

దీర్ఘకాలం కోసమని భారీగా పెట్టుబడి పెట్టిన వారు తాజా పతనంలో తమ పోర్ట్‌ఫోలియో విలువ చూసుకుని కంగారుపడిపోయే పరిస్థితి నెలకొంది. తాజా పతనంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంపద భారీగా(రూ.17 లక్షల కోట్లకు పైగా) కోతకు గురైంది.  మార్కెట్‌ ఓ పెద్ద టీచర్‌. ఏ తప్పులు చేయరాదో చెబుతూనే ఉంటుంది. కానీ, ఇన్వెస్టర్లుగా మనం వాటిని పట్టించుకోం... పట్టించుకున్నా... మార్కెట్‌ మాయలో గుర్తుంచుకోం.  

 

‘‘తాజా పతనం నుంచి నేర్చుకున్న అతిపెద్ద పాఠం... రోమ్‌ నగరం ఒక్క రోజులో నిర్మాణం కాలేదు. కానీ, హీరోషిమా, నాగసాకి పట్టణాలు ఒక్కరోజులోనే నాశనమయ్యాయి. రాత్రికి రాత్రే స్టాక్‌ మార్కెట్లో కోటీశ్వరులైపోవాలని అనుకోవడం సరికాదు’’ అని ప్రముఖ ఇన్వె‍స్టర్‌ విజయ్‌ కేడియా పేర్కొన్నారు. ప్రముఖ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను ఎందుకు కాపీ కొట్టరాదో మార్కెట్‌ మనకు చెబుతుందని ఆయన అన్నారు. ఒకరి స్టాక్స్‌ను అనుసరించడానికి బదులు తమ సిద్ధాంతాలను అనుసరించాలని ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. ‘‘ఇన్వెస్టర్లు కొన్ని స్టాక్స్‌లో పెట్టుబడులపై లాభాలను ఆర్జించి ఉండొచ్చు. కానీ, ఒక్క స్టాక్‌ ఇచ్చిన ప్రతికూల రాబడులతో వారి మొత్తం సంపద తుడిచిపెట్టుకుపోవచ్చు’’ అని కేడియా పేర్కొన్నారు. దశాబ్దాల ఇన్వెస్టింగ్‌ అనుభవం కలిగిన రాకేశ్‌ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో... అధిక శాతం స్టాక్స్‌ 75 శాతం వరకు ఈ ఏడాది పతనం అయ్యాయి. ‘‘నా పోర్ట్‌ఫోలియోలో మంచి పనితీరు చూపని స్టాక్‌లో తక్కువ పెట్టుబడులు పెడతా. అదే సమయంలో నా పోర్ట్‌ఫోలియోను అనుసరించే వారు వారి మొత్తం పెట్టుబడులను అదే స్టాక్‌లో పెట్టొచ్చు. ఇది వారికి ఎక్కువగా నష్టం కలిగించొచ్చు’’ అని కేడియా వివరించారు. ఓ స్టాక్‌ను గుడ్డిగా కొనుగోలు చేయవద్దని సూచించారాయన. స్టాక్‌ కంటే పెట్టుబడి సూత్రాలను అర్థం చేసుకోవాలని, కంపెనీ వ్యాపారాన్ని ముందుగా తెలుసుకోవాలని హితవు పలికారు. 

 

‘‘కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు తొలుత నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడానికంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా మొదలు పెట్టడం మంచిది. మొదటి బాల్‌కే బుక్కయిపోతే ఆ తర్వాత మార్కెట్‌ పట్ల ప్రతికూల ధోరణే మిగిలిపోయి ఉంటుంది’’ అని విజయ్‌ కేడియా చెప్పారు. దీర్ఘకాలం పాటు కొనసాగే విధానాన్ని పాటించాలని సూచించారు. స్వల్ప కాలంలో రాబడులకు ఎటువంటి హామీ లేదన్నారు. మంచి మేనేజ్‌మెంట్‌, చక్కని ఆర్థిక సామర్థ్యాలు ఉన్న వ్యాపారాన్ని నమ్ముకోవాలని సూచించారు. అధిక విశ్వాసంతో రుణాలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టొద్దని సూచించారు. మార్కెట్లు భారీగా పెరిగిన తర్వాతే ఈ తరహా కరెక్షన్లు వస్తాయని కోల్‌కతాకు చెందిన వ్యాల్యూ ఇన్వెస్టర్‌ అభిషేక్‌ బసుమల్లిక్‌ పేర్కొన్నారు. 2017లో మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్టు చెప్పారు. ‘‘మనందరం మార్కెట్లు పతనం అవకముందే బయటకు వచ్చేస్తామని అనుకుంటాం. అనుకోకుండా మార్కెట్లు పతనంలోకి వెళితే చిక్కుకుపోతాం. ఆ సమయంలో మంచి ధైర్యం అవసరం. ఇన్వెస్ట్‌ చేసే కంపెనీ వ్యాపార విలువ, నాణ్యతను నమ్ముకోవాలి’’ అని బసుమల్లిక్‌ సూచించారు. మార్కెట్లు పెరగడం, పడడం అన్నవి సహజమని, గతంలోనూ ఇలాంటివి చోటు చేసుకోగా, భవిష్యత్తులోనూ ఇవి సాధారణమేనన్నారు. కానీ కోలుకున్న ప్రతీసారి మార్కెట్లు నూతన గరిష్టాలకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో మంచి రాబడులను ఇచ్చే స్టాక్స్‌ కొనుగోలు చేసి వాటి ధరల్ని రోజూ చూడడం మానుకోవాలని రీసెర్చ్‌ అనలిస్ట్‌ ఏకాంత్‌ మిట్టల్‌ సూచించారు. అదే పనిగా చూస్తుంటే స్టాక్‌ ధర కొంచెం పతనమైనా చూసి నియంత్రణలో ఉండలేరని పేర్కొన్నారు.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పైకి..

Saturday 13th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతోనే ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 39 పాయింట్ల లాభంతో 10,518 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,486 పాయింట్లతో పోలిస్తే 32 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  కాగా ముడి చమురు ధరలు చల్లబడటం, రూపాయి రికవరీ కావడం వంటి సానుకూలాంశాల కారణంగా

గ్యాస్‌ పంపిణీ కంపెనీలకు బంగారు భవిష్యత్తు!

Friday 12th October 2018

మార్కెట్లు పడుతుంటే... కంపెనీ ఎంత గొప్పదన్న అంశాన్ని ఇన్వెస్టర్లు చూడరు. అమ్మడమే ఎక్కువ మంది చేసే పని. అందుకే బుల్‌ మార్కెట్‌తో పోలిస్తే బేర్‌ మార్కెట్లో మంచి పెట్టుబడి అవకాశాలు అందివస్తాయంటారు. ఆ విధంగా చూస్తే వ్యాపార పరంగా మంచి భవిష్యత్తు ఉన్న సహజవాయువు పంపిణీ కంపెనీలు ఇంద్రప్రస్థ గ్యాస్‌, మహానగర్‌ గ్యాస్‌ పెట్టుబడికి ఆకర్షణీయమైన ధరలకు దిగొచ్చాయి. మహానగర్‌ గ్యాస్‌ 43 శాతం, ఇంద్రప్రస్థ గ్యాస్‌ 35 శాతం

Most from this category