STOCKS

News


సిప్‌ నిధుల ప్రవాహం లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకే...

Wednesday 8th August 2018
Markets_main1533722120.png-19053

గతేడాది వరకు స్మాల్‌క్యాప్‌ ఫం‍డ్స్‌లోకి సిప్‌ పెట్టుబడులు ఎక్కువగా వచ్చేవని రిలయన్స్‌ నిప్సాన్‌ లైఫ్‌ ఏఎం ఈడీ, సీఈవో సుదీప్‌ సిక్కా తెలిపారు. అయితే ఏడాది నుంచి మరీముఖ్యంగా 3-4 నెలల కాలంలో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి సిప్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. గత నెలలో మార్కెట్లు పడ్డప్పుడు గమనిస్తే ట్రెండ్‌ మారిందని తెలిపారు. గత 4-5 నెలలుగా మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చే సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు, కొత్త ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం ప్రారంభమైందని తెలిపారు. 25 లక్షల సిప్స్‌ ఖాతాలున్నాయని, స్టాక్‌ కోణంలో చూస్తే ఇవి లార్జ్‌ క్యాప్స్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, బ్యాలెన్స్‌ ఫండ్స్‌లో సమంగా విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గత 3-4 నెలల కాలంలో సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు ఎక్కువగా వస్తున్నాయని, ఇవి ఎక్కువగా లార్జ్‌క్యాప్స్‌లోకి వెళ్తున్నాయని తెలిపారు. 
ఇన్వెస్టర్లు ప్రస్తుతం గతంలో మాదిరి మార్కెట్లు పడ్డప్పుడు గందోరగోళానికి గురికావడం లేదని సుదీప్‌ సిక్కా పేర్కొన్నారు. పరిశ్రమలో మొత్తంగా చూస్తే రిడంప్షన్లు ఎప్పటిలాగే స్థిరంగా ఉన్నాయని, ఇవి సాధారణమని తెలిపారు. గతంలో మార్కెట్లు పెరిగినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్లు ఒకేసారి పెద్ద మొత్తంలో వచ్చేయని, అయితే ఈసారి ఇన్వెస్ట్‌మెంట్లు ఎక్కువగా సిప్‌ రూపంలో వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అంశం ఇన్వెస్టర్ల అనుభవం, దీర్ఘకాల దృష్టి వంటి అంశాలను సూచిస్తున్నాయని తెలిపారు. దీని వల్ల ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రిడంప్షన్లు పెరగడం లేదన్నారు. 
ప్రస్తుతం మార్కెట్‌ ట్రెండ్‌ మారిందని సుదీప్‌ సిక్కా పేర్కొన్నారు. గత ఏడాది వరకు స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి ఎక్కువగా సిప్‌ పెట్టుబడులు వచ్చేవని తెలిపారు. అయితే ఏడాది నుంచి లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లోకి సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఇదివరకు చివరి త్రైమాసికంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్లు ఎక్కువగా వచ్చేవని తెలిపారు. అయితే ఇప్పుడు మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉన్న ట్యాక్స్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌లోకి సిప్స్‌ ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఇండియన్‌ ఇన్వెస్టర్ల పరిపక్వతకు ఇది ఒక మంచి ఉదాహరణ అని తెలిపారు.  



You may be interested

ఎన్నికలయ్యేంత వరకు ఆగండి!

Wednesday 8th August 2018

ఆ తర్వాతే పెట్టుబడులు బెటర్‌ ప్రిన్సిపాల్‌ పీఎన్‌బీ ఏఎంసీ సీఐఓ రజత్‌ జైన్‌ ఈ ఏడాది ఆరంభంలో కరెక‌్షన్‌ అనంతరం నిఫ్టీ పుంజుకొని కొత్త గరిష్ఠాలను తాకింది. అయితే ఈ ఊపు మొత్తం స్టాకులన్నింటిలో కనిపించలేదు. కేవలం కొన్ని లార్జ్‌ క్యాప్స్‌ మాత్రమే నిఫ్టీని పైకి లేపాయని రజత్‌ చెప్పారు. ఇక మీదట ఇలాంటి మూవ్‌కు ఆస్కారం ఉండకపోవచ్చన్నారు. ఇప్పటినుంచి లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ అన్నీ ఒకేలా ప్రవర్తించే ఛాన్సులున్నాయని అంచనా

కొత్త రికార్డు హైకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్..!

Wednesday 8th August 2018

ముంబై:- దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేరు బుధవారం మరో కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటాను కొనుగోలు చేయడంతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలో రిలయన్స్‌ 1శాతం వరకు ర్యాలీ చేసింది. అన్ని అనుమతులు పొందిన అనంతరం తమ సంస్థలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 5 శాతం వాటా కొనుగోలు పూర్తయ్యిందని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.  ఈరోస్‌ నుంచి

Most from this category