STOCKS

News


నిఫ్టీకి తక్షణ మద్దతు 11,000 పాయింట్లు

Wednesday 26th September 2018
Markets_main1537955274.png-20601

మంగళవారం పాజిటివ్‌గా క్లోజయిన సూచీలు తిరిగి బుధవారం నేలచూపులు చూస్తున్నాయి. నిఫ్టీ 11050 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. గురువారం డెరివేటివ్‌ ఎక్స్‌పైరీ క్లోజింగ్‌ సందర్భంగా సూచీలు స్తబ్ధుగా మారాయి. ఇప్పటికైతే మార్కెట్లో ట్రెండ్‌ నెగిటివ్‌గానే ఉందని, చిన్న పాటి షార్ట్‌ కవరింగ్‌లు తప్ప పెద్ద ర్యాలీకి ఛాన్సులు తక్కువని నిపుణుల అంచనా. నిఫ్టీకి 11000 పాయింట్ల వద్ద ప్రస్తుతం తక్షణ మద్దతు లభిస్తోంది. దీనికి దిగువన 10750, 10630, 10557, 9952 పాయింట్లు మద్దతుగా వ్యవహరిస్తాయి. పైస్థాయిలో 11207 పాయింట్లనుదాటితేనే అప్‌మూవ్‌ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు న్యూట్రల్‌గా ఉన్నాయి. ఆప్షన్ల డేటా చూస్తే 11200, 11500 పాయింట్ల వద్ద భారీగా కాల్స్‌, 11000, 10800 పాయింట్ల వద్ద భారీగా పుట్స్‌ పోగయ్యాయి. ఈ రెండు రోజలు ఈ స్థాయిలకు లోబడే నిఫ్టీ కదలికలుండవచ్చు. సెప్టెంబర్‌ ఎక్స్‌పైరీ అనంతరమే నిఫ్టీలో ఎటోఒకవైపు కదలికలు ఉండే అవకాశాలున్నాయి. 



You may be interested

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ విలువెంత?

Wednesday 26th September 2018

మార్కెట్లో కుదుపులు సృష్టించిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. ఇదే బాటలో మరిన్ని ఎన్‌బీఎఫ్‌సీలు డిఫాల్ట్‌ అయ్యే ప్రమాదాలున్నాయన్న భయాలు మార్కెట​‍్లను కుంగదీస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణమైన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ తాజాగా నిధులు సమీకరించి రుణాలు తీర్చాలని భావిస్తోంది. ఇందుకోసం షేర్‌హోల్డర్ల అనుమతిని ఆశిస్తోంది. తాజాగా 4,500 కోట్ల రూపాయలు సమీకరించేందుకు సరిపడ షేర్లు విక్రయానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీలో అతిపెద్ద వాటాదారులైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐల

స్మాల్‌, మిడ్‌క్యాప్‌ పెట్టుబడులకు ఇదే సమయం

Wednesday 26th September 2018

చెరువులో నీళ్లు అడుగుకు వెళ్లినప్పుడు చేపలను సులువుగా పట్టుకోవచ్చు. దీనే స్టాక్‌ మార్కెట్‌కు అన్వయించుకున్నారు ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ సీఐవో నవ్‌నీత్‌ మునోత్‌. ఇటీవల కాలంలో మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌లో మంచి కరెక‌్షన్‌ జరిగిందని, అందువల్ల వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్‌ పతనం వల్ల కొన్ని లార్జ్‌క్యాప్స్‌ మిడ్‌క్యాప్స్‌ అయ్యాయని, అలాగే కొన్ని

Most from this category