STOCKS

News


ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ సమస్య: కేం‍ద్రం జోక్యం ఎందుకు?

Wednesday 26th September 2018
Markets_main1537948545.png-20592

ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ సమస్యలోకి కేంద్రం పరోక్షంగా జోక్యం చేసుకుంది. మంగళవారం నాటి ఎల్‌ఐసీ ప్రకటనను గమనిస్తే ఇది అర్థమౌతుంది. ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంబంధిత రంగంలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారకుండా ఉండేందుకు కేంద్ర జోక్యం చాలా అవసరమని ఎఫ్‌ఐడీసీ చైర్మన్‌ రామన్‌ అగర్వాల్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం నిజమేనని, అయితే దీన్ని సాకుగా పేర్కొంటూ సంబంధిత రంగంలోని అన్ని కంపెనీలు గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయని, ఆ రంగం సంక్షోభంలో కూరుకుపోయ్యిందని చెప్పడం సరికాదని రామన్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. గత కొన్ని నెలలు వెనక్కి వెలితే 2018 జూన్‌లో ఆర్‌బీఐ జారీ చేసిన ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ (ఆర్థిక స్థిరత్వం) నివేదిక సంబంధిత ఎన్‌బీఎఫ్‌సీ రంగ స్వభావిక బలాన్ని తెలియజేస్తోందని తెలిపారు. ఈ రంగానికి సంబంధించి క్యాపిటల్‌ అడక్వసీ రేషియో సగటున 2018 మార్చి నాటికి 22.9 శాతంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఎన్‌బీఎఫ్‌సీ రంగ క్రెడిట్‌ రిస్క్‌ను తెలుసుకునేందుకు ఆర్‌బీఐ.. స్ట్రెస్‌ టెస్ట్‌‌ కూడా నిర్వహించిందని, ఇందులోనూ క్యాపిటల్‌ అడక్వసీ రేషియో 20 శాతానికిపైగా నమోదయ్యిందని తెలిపారు. పై రెండు సందర్భాల్లోనూ క్యాపిటల్‌ అడక్వసీ రేషియో ఆర్‌బీఐ నిర్దేశించిన 15 శాతం కన్నా ఎక్కువగానే ఉందని పేర్కొన్నారు. ఇది ఎన్‌బీఎఫ్‌సీ రంగ స్వభావిత బలాన్ని సూచిస్తోందని తెలిపారు.  
మార్కెట్‌లో మనం చూసింది పానిక్‌ రియాక‌్షన్‌ అని రామన్‌ అగర్వాల్‌ తెలిపారు. లిక్విడిటీకి సంబంధించి ఆందోళనలు ఉన్నా కూడా.. ముందస్తు పన్ను చెల్లింపులు సహా ఇతర అంశాలు ప్రభావం చూపాయని పేర్కొన్నారు. ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌లో తలెత్తిన పరిస్థితుల వల్ల మార్కెట్‌ సెంటిమెంట్‌ తగ్గిందని తెలిపారు. ఎలాంటి సంక్షోభ భయాలు కనిపించడం లేదన్నారు. ‘పలు అంశాల ప్రాతిపదికన రుణ వ్యయాలు పెరగొచ్చు. అందువల్ల సమీప కాలంలో స్వల్పకాల లిక్విడిటీ సమస్య ఎదురవుతుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని వివరించారు. ఇది వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదని, రంగానికి సంబంధించిన సమస్య కాదని, అనుకోకుండా తలెత్తిన ఒక సమస్య అని, ఇది వ్యవస్థలో ఆందోళనలు ఏర్పరచిందని తెలిపారు. వృద్ధి రేటు తగ్గుతుందనడానికి ఇది ఒక సూచిక లాంటిందని అభిప్రాయపడ్డారు. 
 You may be interested

బీఈఎల్‌ 11 శాతం అప్‌

Wednesday 26th September 2018

ముంబై:- వచ్చే మూడేళ్లలో కంపెనీ రెండంకెల వృద్ధిని సాధిస్తుందని యాజమాన్యం చేసిన ప్రకటనతో ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌(బీఈఎల్‌) షేరు బుధవారం భారీగా లాభపడింది. వచ్చే మూడేళ్లలో కంపెనీ ఆదాయం 12-15శాతం వృద్ధిని, ఈబిటా మార్జిన్‌ వృద్ధి 17-19శాతం మధ్య నమోదు చేస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ.18-20వేల కోట్ల ఆర్డర్లను దక్కించుకుందని ప్రకటించింది. అలాగే పెరిగిన కొత్త ధరల విధానం కంపెనీ మార్జిన్లపై ఎలాంటి ప్రభావాన్ని

మార్కెట్‌ యూటర్న్‌

Wednesday 26th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ రివర్స్‌ గేర్‌లో వెళ్తోంది. గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన సూచీలు తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నాం 1:09 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 261 పాయింట్ల నష్టంతో 36,391 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో 11,001 వద్ద ట్రేడవుతున్నాయి.  నిఫ్టీ-50లో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 7 శాతానికిపైగా లాభపడింది. ఇక యూపీఎల్‌ 3 శాతానికిపైగా ఎగసింది. టైటాన్‌, యస్‌ బ్యాంక్‌, గెయిల్‌ షేర్లు 2 శాతానికిపైగా పెరిగాయి. మరోవైపు టాటా

Most from this category